న్యూస్ బాక్స్ ఆఫీస్

మజిలీ రెండో వారం థియేటర్స్ కౌంట్ తెలిస్తే షాక్!

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది, అది అత్యంత ఘనంగా ముగించుకుని సత్తా చాటుకుంది అని చెప్పాలి, ఇక సినిమా మొత్తం మీద మొదటి వారం లో బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల కి పైగా షేర్ ని 45 కోట్ల వరకు గ్రాస్ ని వసూల్ చేయగా సినిమా ఇప్పుడు రెండో వారం లో కొత్త సినిమా…

చిత్రలహరి ని ఎదురుకుంటున్నా కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ గా థియేటర్స్ ని హోల్డ్ చేసి సత్తా చాటుకుంది, సినిమా రిలీజ్ అవ్వడం రెండు తెలుగు రాష్ట్రాలలో 650 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా తర్వాత కొద్దిగా థియేటర్స్ తగ్గగా ఇప్పుడు రెండో వారం లో…

నైజాం ఏరియా లో 135 కి పైగా థియేటర్స్ లో అలాగే ఆంధ్రా మరియు సీడెడ్ ఏరియాలలో 220 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసి రెండో వారాన్ని కొనసాగిస్తుంది, అంటే రెండో వారం లో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 350 కి పైగా థియేటర్స్ లో రన్ అవుతుందని సమాచారం.

కొత్త సినిమా ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో థియేటర్స్ ని హోల్డ్ చేసిన మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ని కన్ఫాం చేసుకోగా త్వరలోనే సినిమా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేయడమే కాకుండా కెరీర్ లో సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసే అవకాశం..

పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి, సినిమా ఇప్పటికే 28 కోట్ల కి పైగా షేర్ ని అందుకోగా రెండో వీకెండ్ లో ఏమాత్రం హోల్డ్ చేసినా 30 కోట్లకు పైగా షేర్ ని అందుకుని వీకెండ్ ని ఘనంగా ముగించే అవకాశం ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!