న్యూస్ బాక్స్ ఆఫీస్

మన్మథుడు2(డే 5) Vs కొబ్బరి మట్ట(డే 4)… షాకింగ్ కలెక్షన్స్ అప్ డేట్

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలు మన్మథుడు 2 మరియు కొబ్బరి మట్ట రెండు సినిమాలు తొలి వర్కింగ్ డే టెస్ట్ ను ఈ రోజు ఎదురుకున్నాయి. కాగా రెండు సినిమాలలో కొబ్బరి మట్ట వర్కింగ్ డే అయినా కానీ స్టడీ గా కలెక్షన్స్ ని సాధించి సత్తా చాటుకుంది, మరో పక్క మన్మథుడు 2 సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు మరింత గా డ్రాప్స్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది.

మన్మథుడు 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు ముగిసే సరికి మొత్తం మీద 9.37 కోట్ల షేర్ ని అందుకోగా 5 వ రోజు వర్కింగ్ డే అవ్వడం తో ఓవరాల్ గా 4 వ రోజు తో పోల్చితే 50% కన్నా ఎక్కువగానే డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొంచమ్ గ్రోత్ వచ్చినా కానీ..

అది మొత్తం మీద రోజు ని బాగా ముగించడానికి ఉపయోగ పడలేదు. దాంతో సినిమా 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 40 లక్షల నుండి 45 లక్షల వరకు షేర్ ని అందుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక సినిమా తెరుకోవాలి అంటే అద్బుతాలు జరగాలి అని చెప్పాలి.

ఇక సంపూర్నేష్ బాబు నటించిన కొబ్బరి మట్ట బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో 1.92 కోట్ల షేర్ ని అందుకోగా నాలుగో రోజు సినిమా 3 వ రోజు తో పోల్చితే 35% లోపు డ్రాప్స్ ని మాత్రమె సొంతం చేసుకుంది, అది ఎక్కువ సినిమాలకు మామూలే కాబట్టి.. సినిమా 4 వ రోజున…

బాక్స్ ఆఫీస్ దగ్గర 30 లక్షల నుండి 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, దాంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 2 కోట్ల మార్క్ ని ఈ రోజు దాటనుంది, మైనర్ ప్రాఫిట్స్ లో అడుగు పెట్టనున్న సినిమా ఒకటి 2 రోజుల్లో ఫుల్ ప్రాఫిట్స్ లో ఉండబోతుంది అని చెప్పాలి. ఇక 2 సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!