న్యూస్ బాక్స్ ఆఫీస్

మన్మథుడు2 డే 2 కలెక్షన్స్…ఆ టాక్ ఏంటి…ఈ కొట్టుడేంటి!

కింగ్ నాగార్జున కెరీర్ లో కల్ట్ క్లాసిక్ మూవీ గా వచ్చిన మన్మథుడు సినిమా కి సీక్వెల్ గా వచ్చిన మన్మథుడు 2 బాక్స్ ఆఫీస్ దగ్గర బయట యావరేజ్ రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకున్నా కానీ సోషల్ మీడియా లో మాత్రం భారీ నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, అయినా కానీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపిన సినిమా 2.5 కోట్లు అనుకుంటే ఏకంగా 5.12 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక రెండో రోజు సినిమా టాక్ అప్పటికే అన్ని చోట్లా స్ప్రెడ్ అయినా కానీ సినిమా మంచి ఓపెనింగ్స్ తో రోజు ను బాగానే హోల్డ్ చేసిందని చెప్పాలి, క్లాస్ సెంటర్స్ బాగానే హోల్డ్ చేయగా మొదటి రోజు తో పోల్చితే మాస్ సెంటర్స్ కూడా కొద్దిగా గ్రోత్ ని సాధించాయి.

దాంతో రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డీసెంట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది, సినిమా మొదటి రోజులా రెండో రోజు హైర్స్ లేవు కాబట్టి వర్త్ షేర్ సుమారు 2 కోట్ల కి పైగా ఉండే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండి….

మాస్ సెంటర్స్ లో కూడా సినిమా జోరు చూపితే మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలలో 2.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం కూడా ఉంది, ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 2.7 కోట్ల కి వెళ్ళే అవకాశం ఉంది, అదే కనుక జరిగితే సినిమా బిజినెస్ లో 45% వరకు కేవలం….

2 రోజుల లోనే రికవరీ చేసినట్లు అవుతుంది, సినిమా కి సోషల్ మీడియా లో వినిపిస్తున్న టాక్ కి ఇది అల్టిమేట్ రేంజ్ అనిపించే కలెక్షన్స్ అని చెప్పాలి. మరి సినిమా రెండో రోజు అఫీషియల్ గా ఎంతవరకు కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!