న్యూస్ బాక్స్ ఆఫీస్

మన్మధుడు2 డే 4 Vs కొబ్బరి మట్ట డే 3..కలెక్షన్స్ రిపోర్ట్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ రిలీజ్ అయిన రెండు సినిమాలు మన్మథుడు2 మరియు కొబ్బరి మట్ట రెండు సోమవారం బ్రకీద్ హాలిడే ను పర్వాలేదు అనిపించే విధంగా ఎంజాయ్ చేశాయి. ముఖ్యంగా కొబ్బరి మట్ట మరోసారి మంచి కలెక్షన్స్ తో రోజుని ముగించగా మన్మథుడు2 పడుతూ లేస్తూ ఎలా గోలా మినిమమ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజుని ముగించింది. కాగా మొత్తం మీద రెండు సినిమాల కలెక్షన్స్ ని గమనిస్తే…

ముందుగా మన్మథుడు 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో మొత్తం మీద 8.51 కోట్ల షేర్ దాకా వసూల్ చేయగా సోమవారం 4 వ రోజు అవ్వగా మూడో రోజు తో పోల్చితే 35% వరకు డ్రాప్స్ ని సినిమా సొంతం చేసుకుంది, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజున…

1 కోటి కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ లెక్కలు పూర్తిగా తేలాల్సి ఉండగా ఈ లెక్క మొత్తం మీద పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఇక సంపూర్నేష్ బాబు కొబ్బరి మట్ట బాక్స్ ఆఫీస్ దగ్గర 2 డేస్ లో 1.33 కోట్ల దాకా షేర్ ని అందుకోగా…

మూడో రోజు కూడా మంచి ఆక్యుపెన్సీ తో రన్ అయిన ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా అదే ట్రెండ్ ని కొనసాగించి మినిమమ్ డ్రాప్స్ తోనే రన్ అవ్వడం విశేషం, మొత్తం మీద మూడో రోజు ఈ సినిమా మరో సారి 50 లక్షలకు అటూ ఇటూ గా…

కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ రెండు సినిమాలు బక్రీద్ హాలిడే రోజున కలిపి మంచి కలెక్షన్స్ నే సాధించాయి. ఇక ఈ రెండు సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!