న్యూస్ బాక్స్ ఆఫీస్

మన రేట్లు తగ్గుతున్నాయి…వీళ్ళకి మాత్రం పెరుగుతున్నాయి…80 నుండి కొత్త లెక్క తెలిస్తే షాక్!

OTT యాప్స్ చాలా తెలివిగా కొన్ని సినిమాలను క్యాష్ చేసుకుంటున్నాయి, కొన్ని సినిమాల విషయం లో మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. సౌత్ మూవీస్ పరంగా ముందు పెద్ద చిన్న అని తేడా లేకుండా అన్ని సినిమాలకు భారీ రేట్లు ఆఫర్ చేసి తర్వాత ఒక సినిమా ఓకే అన్న తర్వాత ఇప్పుడు మిగిలిన సినిమాల రేట్లు తగ్గిస్తుండగా ఒకటి రెండు సినిమాలకు మాత్రం రేట్లు పెరగడం విశేషం అని చెప్పాలి.

అదే సమయం లో హిందీ సినిమాల విషయానికి వస్తే దాదాపు అన్ని సినిమాలకు కూడా మామూలు రేట్ల కన్నా కూడా ఎక్కువ రేట్లనే ఆఫర్ చేస్తూ వస్తున్న OTT యాప్స్ ఒకటి అరా సినిమాలకు మాత్రం రేట్లు తగ్గించినా మిగిలిన సినిమాలకు రేట్లు పెంచుకుంటూ పోతున్నాయి.

దానికి మరో కారణం యూనిట్ సినిమా ప్రమోషన్ లో పాలు పంచుకుంటామని చెబితే రేట్లు కొంచం ఎక్కువ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని సమాచారం. ఇప్పుడు ఇదే పద్దతిలో ఒక సినిమా కు ముందు వేరే OTT యాప్స్ ఇచ్చిన రేటు ఆఫర్ కి భారీ లెవల్ లో రేటు పెంచి ఇచ్చింది ప్రైమ్ వీడియో.

ఆ సినిమానే వరుణ్ ధవన్ సారా అలీ ఖాన్ ల కాంబో లో వస్తున్న కూలీ నంబర్ 1 మూవీ.. ఈ సినిమా కి ఇతర OTT యాప్స్ 80 కోట్ల రేంజ్ రేటు ఆఫర్ చేయగా అమెజాన్ ప్రైమ్ ఏకంగా ప్రమోషన్స్ సాలిడ్ గా చేస్తామని ఒప్పించుకుని ఏకంగా 120 కోట్ల రేటు పెట్టి ఈ సినిమాను కొన్నదని లేటెస్ట్ బాలీవుడ్ ట్రేడ్ న్యూస్.

ముందు అనుకున్న రేటే ఇప్పుడు ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఆ రేటు కి ఏకంగా 40 కోట్లు అధికంగా చెల్లించడం చూసి కొందరు షాక్ అవుతుంటే, సౌత్ మూవీస్ కి రేట్లు తగ్గించి ఇక్కడ మాత్రం ఇలా పెంచడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు. సౌత్ లో కూడా ఎక్స్ క్లూజివ్ ప్రమోషన్స్ చేస్తే ఇంకా ఎక్కువ రేటు వచ్చే అవకాశం ఉందేమో అని ఇప్పుడు కొందరు ట్రై చేస్తున్నారని తెలుస్తుంది.

Leave a Comment