న్యూస్ స్పెషల్

మరో ఇండియన్ రికార్డ్ కొట్టిన అజిత్ సినిమా….24 గంటల రిపోర్ట్ ఇదే!

కోలివుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ వలిమై కోసం ఫ్యాన్స్ కళ్ళు ఖాయలు కాచేలా ఎదురు చూసి ఎట్టకేలకు రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లు అలాగే మోషన్ పోస్టర్ కూడా రావడం తో సోషల్ మీడియా లో తమ ఫ్యాన్స్ పవర్ ని చూపెట్టారు. ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేసి హీరో పేరిట అల్టిమేట్ రికార్డ్ దక్కేలా చేశారు.. ఆ రికార్డ్ కోలివుడ్ వరకే కాకుండా…

ఇప్పుడు ఏకంగా ఇండియా వైడ్ గా ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డ్ ను సొంతం చేసుకునేలా చేయడం విశేషం అని చెప్పొచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయిన అజిత్ కుమార్ వలిమై మోషన్ పోస్టర్ ఇండియన్ సినిమా హిస్టరీలో 24 గంటల్లో అల్టిమేట్ రికార్డులను సొంతం చేసుకుంది.

ఈ మోషన్ పోస్టర్ మొత్తం మీద 3 ఛానెల్స్ లో రిలీజ్ అవ్వగా ఒక ఛానెల్ లో 5.1 మిలియన్ వ్యూస్ ని 646K లైక్స్ ని సొంతం చేసుకోగా రెండో ఛానెల్ లో 2 మిలియన్ వ్యూస్ ని 279K లైక్స్ ని సాధించింది. ఇక మూడో ఛానెల్ లో 1 మిలియన్ వ్యూస్ ని 185K లైక్స్ ని సాధించింది.

దాంతో మొత్తం మీద 3 ఛానెల్స్ కలిపి 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ ని 1.1 మిలియన్ దాకా లైక్స్ ని సొంతం చేసుకుని కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఒకసారి ఇండియా లో టాప్ మోషన్ పోస్టర్స్ ని గమనిస్తే…
👉#ValimaiMotionPoster – 8.3M & 1.1M Likes(Tamil)***
👉#BeatsOfRadheShyam – 4.73M & 253.6K Likes(Telugu)
👉#RRRMotionPoster – 4.64M & 359K Likes(Telugu)
👉#BeatsOfRadheShyam – 4.3M & 289K Likes(Hindi)
👉#ViswasamMotionPoster – 3.7M & 377K Likes(Tamil)
👉#DarbarMotionPoster – 3.5M & 291K Likes (Tamil)

ఈ రేంజ్ లో రచ్చ చేసిన వలిమై మోషన్ పోస్టర్ ఇది వరకు టాప్ లో ఉన్న రాధే శ్యామ్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. వలిమై కూడా పాన్ ఇండియా మూవీ అంటున్నారు కానీ ఒకే మోషన్ పోస్టర్ ని మూడు ఛానెల్స్ లో రిలీజ్ చేశారు కానీ వేరు వేరు భాషల్లో రిలీజ్ చేయలేదు, అలా కాకుండా పాన్ ఇండియా మూవీస్ మాదిరిగానే చూస్తె ఇప్పటికీ వ్యూస్ పరంగా రాధే శ్యామ్ 9.03 మిలియన్ తో టాప్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఒకే భాషగా చూస్తె వలిమై టాప్ లో ఉంటుంది.

Leave a Comment