టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

మరో ప్రస్థానం టోటల్ కలెక్షన్స్….!!

చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిన తనీష్ కెరీర్ మొదట్లో నచ్చావులే లాంటి హిట్ తో మంచి జోష్ తో సినిమాలు మొదలు పెట్టగా తర్వాత నాని తో కలిసి చేసిన రైడ్ సినిమా తో మరింత గుర్తింపు సొంతం చేసుకున్నాడు, తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా అందులో మేం వయసుకు వచ్చాం సినిమా కొంచం ఆడియన్స్ ను అలరించింది, కానీ తర్వాత చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ని…

చూపలేక పోయాయి. ఈ గ్యాప్ లో బిగ్ బాస్ సీజన్ 2 కి వెళ్ళినా తన కెరీర్ కి ఆ సీజన్ పెద్దగా హెల్ప్ అవ్వలేదు, తర్వాత చేసిన సినిమాలకు ఆడియన్స్ నుండి అనుకున్న ఆదరణ అయితే లభించలేదు, ఇలాంటి కొత్త కాన్సెప్ట్ అంటూ సింగిల్ షాట్ లో కంప్లీట్ చేసిన…

సినిమా అంటూ మరో ప్రస్థానం అనే పవర్ ఫుల్ టైటిల్ తో తనీష్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా కి పబ్లిసిటీ లాంటివి చేసినా జనాలు థియేటర్స్ కి అయితే తరలి రాలేదు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 260 కి పైగా…

థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా ఆడియన్స్ నుండి సినిమా కి రెస్పాన్స్ బిలో యావరేజ్ అనిపించే లెవల్ లోనే వచ్చింది. మొత్తం మీద మొదటి వీకెండ్ లో ట్రేడ్ లెక్కల ప్రకారం 15 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో మొత్తం మీద 24 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని…

అంచనా వేస్తున్నారు… అందులో షేర్ 14 లక్షల దాకా ఉంటుందని అంటున్నారు. వీటిలో కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ఇంక్లూడ్ చేసి చెప్పినట్లు చెబుతున్నారు. సినిమా బిజినెస్ వివరాలు ఏమి అసలు రిలీజ్ చేయలేదు, బడ్జెట్ కూడా 1.2 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే సినిమా మేకర్స్ కి భారీ నిరాశనే మిగిలించింది అని చెప్పొచ్చు.

Leave a Comment