గాసిప్స్ న్యూస్

మరో మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్ లో వెంకీ…ఏ సినిమా అంటే!!

టాలీవుడ్ హీరోల్లో ఎక్కువగా రీమేక్ లు చేసే హీరోగా విక్టరీ వెంకటేష్ కి పేరుంది. ఇతర భాషల్లో మంచి సినిమా అనిపిస్తే చాలు ఆ సినిమాను తెలుగు ఆడియన్స్ కి అందించడానికి రీమేక్ చేసి ఒరిజినల్ కన్నా బెటర్ యాక్టింగ్ తో రీమేక్ అయినా కానీ నటన పరంగా వంక పెట్టకుండా చూసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ విజయాలను నమోదు చేస్తూ ఉంటాడు వెంకటేష్. ప్రస్తుతం ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీస్ ని…

చేస్తున్న వెంకీ వీలు కుదిరినప్పుడల్లా సోలో హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్ 3, అసురన్ రీమేక్ నారప్ప మరియు దృశ్యం 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న వెంకీ ఇప్పుడు ఈ సినిమాలతో పాటు మరో కొత్త సినిమాను కూడా కమిట్ అయ్యారని…

టాలీవుడ్ లో లేటెస్ట్ గా టాక్ చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆ టాక్ ప్రకారం మలయాళంలో 4 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ని ఇప్పుడు వెంకీ రీమేక్ చేయబోతున్నారని అంటున్నారు. 4 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా ను… ఎప్పటి నుండో…

తెలుగు లో రీమేక్ చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కాంబినేషన్ అయితే సెట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు వెంకీ ఈ రీమేక్ కి ఓకే చెప్పారని టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుండగా డ్రైవింగ్ లైసెన్స్ మూవీ లో ఇద్దరు హీరోలు యాక్ట్ చేయగా ఇక్కడ మరో హీరోగా ఎవరిని తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారగా… టాలీవుడ్ లో వినిపిస్తున్న మరో బజ్ ఏంటంటే…

ఈ రీమేక్ లో వెంకీ రెండు రోల్స్ చేసినా చేయోచ్చు అన్నట్లు చెబుతున్నారు. ఒక ట్రాఫిక్ పోలిస్ కి అలాగే ఒక హీరో కి మధ్య చిన్న ఈగో క్లాష్ పెద్ద గొడవగా మారుతుంది, ఆ కాన్సెప్ట్ లో రెండు పాత్రలు వెంకీ చేస్తారేమో అన్న రూమర్ వినిపిస్తుంది, మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజా నిజాలు ఉన్నాయి అన్నది త్వరలోనే ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పాలి.

Leave a Comment