న్యూస్

మరో రికార్డ్…ఇటు టాప్ 2, అటు టాప్ 6…..ఈ రికార్డులు ఆగేలా లేవు!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రిలీజ్ అయ్యి నెలకు పైగానే టైం అవుతున్నా కానీ యూట్యూబ్ లో రికార్డుల వర్షం మాత్రం ఆపకుండా జోరు చూపుతూనే ఉంది, సినిమా టీసర్ ఇప్పటికే టాలీవుడ్ తరుపున అన్ని రికార్డులను తుడిచిపెట్టి కొత్త రికార్డులను నమోదు చేయగా…

లైక్స్ పరంగా సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఈ టీసర్ వ్యూస్ పరంగా టాలీవుడ్ తరుపున ఫాస్టెస్ట్ 30 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఇక కామెంట్స్ పరంగా టాలీవుడ్ లో ఫస్ట్ 1 లక్ష కామెంట్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలవగా…

ఇప్పుడు ఆ మార్క్ ని 1.5 లక్షల నుండి 1.75 లక్షల మార్క్ ని కూడా కంప్లీట్ చేసి 2 లక్షల మార్క్ ని అందుకుని మరొ బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేయగా ఇండియా లో టీసర్ ల పరంగా ఇప్పుడు మాస్టర్ టీసర్ తర్వాత ప్లేస్ ని సొంతం చేసుకోగా…

టీసర్ లు అండ్ ట్రైలర్ ల పరంగా ఇండియా లో ఆల్ టైం టాప్ 6 ప్లేస్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఒకసారి ఇండియాలో హైయెస్ట్ కామెంట్స్ ని సొంతం చేసుకున్న టీసర్లు అండ్ ట్రైలర్ ల లిస్టుని గమనిస్తే
#Sadak2Trailer – 1.14M
#DilBecharaTrailer – 620K
#MasterTeaser – 324K**
#SooraraiPottrutrailer – 270K
#zeroTrailer – 220K
#RamarajuForBheem – 200K
#BigilTrailer – 176K

ఇప్పుడే 2 లక్షల మార్క్ ని కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ఊపు చూస్తుంటే త్వరలోనే మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, ఇప్పటికే లైక్స్ పరంగా ఇప్పుడు కామెంట్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసిన ఈ టీసర్ ఇక వ్యూస్ రికార్డ్ ను బ్రేక్ చేయాల్సి ఉందని చెప్పాలి.

Leave a Comment