గాసిప్స్ న్యూస్

మరో షాకింగ్ టైటిల్….ఇది కన్ఫాం కాదులే!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ తర్వాత ఖైదీ నంబర్ 150 మరియు సైరా నరసింహా రెడ్డి సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపగా ఇప్పుడు మరో కమర్షియల్ మూవీ కి సిద్ధం అవుతున్నాడు. టాలీవుడ్ లో అపజయం అంటే తెలియని అతి కొద్ది మంది డైరెక్టర్స్ లో ఒకరిగా కెరీర్ లో ఒక్కో సినిమా తో దూసుకు పోతున్న కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా ఉండబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం సరికొత్త లుక్ లో బరువు తగ్గి స్లిమ్ గా కనబడబోతున్నాడు మెగాస్టార్, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది అందరిలోను ఆసక్తిని రేపుతుండగా రీసెంట్ గా సినిమా కి “గోవింద ఆచార్య” అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

తర్వాత వరుస పెట్టి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా రాగా యూనిట్ కలుగ చేసుకుని టైటిల్ ఇంకా కన్ఫాం కాలేదని డిక్లేర్ చేసింది. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఫిలిం నగర్ లో మరో టైటిల్ చక్కర్లు కొడుతుంది, ఆ టైటిల్ “గోవిందా హరి గోవిందా” అని అంటున్నారు.

కాగా టైటిల్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నా కానీ ఈ టైటిల్ కన్నా గోవింద ఆచార్య నే కొత్తగా ఉందని టాక్ నడుస్తుండగా మొదటి టైటిల్ నే వద్దు అనుకున్న యూనిట్ ఈ టైటిల్ ని కన్ఫాం చేసే అవకాశం చాలా తక్కువే అని అంటున్నారు. ఇక సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి సిద్ధం అవుతుండగా…

సినిమా ని అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020 ఫస్టాఫ్ ఎండింగ్ లో కానీ లేక సెకెండ్ ఆఫ్ లో దసరా సీజన్ లో కానీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. రెండు కంబ్యాక్ మూవీస్ తో 100 కోట్లు అవలీలగా కొట్టేసిన చిరు ఈ సినిమాతో హాట్రిక్ 100 కోట్ల హీరో అవ్వడం ఆల్ మోస్ట్ కన్ఫాం అనే చెప్పాలి.

Leave a Comment