న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

మరో సెన్సేషనల్ రికార్డ్ కొట్టిన అల్లు అర్జున్…కానీ ఒక ఇయర్ లో బ్రేక్ ఖాయం!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఆల్ టైం నాన్ బాహుబలి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30 రోజుల పాటు సెన్సేషనల్ రన్ ని కొనసాగించగా తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అవుతూ ఫైనల్ రన్ ని కంప్లీట్ చేయబోతుంది.

కాగా ఈ క్రమం లో సినిమా టాలీవుడ్ లో అనేక రికార్డులను తిరగరాయగా… జనవరి నెల కి గాను బిగ్గెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమా గా కూడా నిలిచి సంచలనం సృష్టించింది. ఇది వరకు జనవరి నెలలో నాన్నకు ప్రేమతో 55 కోట్లకి పైగా షేర్ తో టాప్ లో ఉండగా…

2017 లో మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ మూవీ అయిన ఖైదీ నంబర్ 150 డబుల్ వసూళ్ళ ని సాధిస్తూ 104 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి జనవరి నెలలో బిగ్గెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమా గా నిలిచింది. ఆ రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమా ఏది అవుతుందా అని ఎదురు చూపులు…

మూడేళ్ళుగా కొనసాగుతుండగా ఈ ఇయర్ సంక్రాంతి మూవీస్ 2 కూడా పోటి పడీ మరీ కలెక్షన్స్ ని సాధించగా ముందుగా సరిలేరు నీకెవ్వరు ఈ రికార్డ్ ను బ్రేక్ చేయగా…వెంటనే గ్యాప్ ఇవ్వకుండా అల వైకుంఠ పురం లో ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి భారీ లీడ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

దాంతో ఇప్పుడు జనవరి నెలలో బిగ్గెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమా గా నిలిచిన అల వైకుంఠ పురం లో ఆల్ మోస్ట్ 159 కోట్ల కి పైగా షేర్ కన్ఫాం చేసుకుంది, కానీ ఈ రికార్డ్ వచ్చే ఇయర్ రిలీజ్ అయ్యే మమ్మోత్ ఆర్.ఆర్.ఆర్ బ్రేక్ చేయడం పక్కా అవ్వడం తో ఇయర్ లోనే రికార్డ్ బ్రేక్ కానుంది. కానీ పోటి లో ఇలాంటి రికార్డ్ కలెక్షన్స్ తో టాప్ లో నిలవడం గొప్ప విషయం అనే చెప్పాలి.

Leave a Comment