న్యూస్

మరో 2 రికార్డులు ఔట్….ఇండియాలో మూడోది…!!

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ అఫీషియల్ టీసర్ సెన్సేషనల్ రికార్డులతో దూసుకు పోతుంది, రిలీజ్ అవ్వడమే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ అండ్ లైక్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా టీసర్ రిలీజ్ అయిన తర్వాత అన్ని రికార్డుల బెండు తీసి కొత్త రికార్డులతో షాక్ ఇచ్చింది, ఇండియాలో అత్యధిక లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచిన ఈ టీసర్…

ఇండియా లో 2 మిలియన్స్ మార్క్ ని అందుకున్న మొదటి టీసర్ గా కూడా నిలిచి రికార్డ్ సృష్టించింది, ఇక సౌత్ లో టీసర్ ల పరంగా ఇప్పుడు ఫాస్టెస్ట్ 30 మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా రికార్డ్ సృష్టించింది ఈ టీసర్…

ఇది వరకు ఈ రికార్డ్ కూడా సర్కార్ టీసర్ పేరిట ఉండేది, ఆ టీసర్ 19-20 రోజుల టైం లోనే ఈ మార్క్ ని అందుకోగా రీసెంట్ గా వచ్చిన రామా రాజు ఫర్ భీమ ఇంట్రో టీసర్ 22 రోజుల్లో ఈ మార్క్ ని అందుకుంది, ఇప్పుడు మాస్టర్ టీసర్ మాత్రం రిలీజ్ అయిన…

మూడున్నర రోజుల లోనే ఈ మార్క్ ని అందుకుని అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేయగా మరో రికార్డ్ ఇండియా లో మూడో ప్లేస్ ని సొంతం చేసుకుంది, రీసెంట్ గా టీసర్ ల కామెంట్స్ పరంగా కూడా రికార్డులు లెక్కిస్తున్న విషయం తెలిసిందే. సూర్య సూరరై పోట్రు ట్రైలర్ కి 2 లక్షల 55 వేల కామెంట్స్ రాగా…

మాస్టర్ టీసర్ ల పరంగా హైయెస్ట్ కామెంట్స్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది, ఏకంగా 2 లక్షల 60 వేలకి పైగా కామెంట్స్ తో మోస్ట్ కామెంట్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా రికార్డ్ సృష్టించగా టీసర్ అండ్ ట్రైలర్స్ రెండూ కలిపి చూస్తే… ఇండియా లో టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకుని దుమ్ములేపింది, ఓన్లీ టీసర్ ల పరంగా ఇది సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి.

Leave a Comment