గాసిప్స్ న్యూస్

మళ్ళీ కొత్త వార్….లవ్ స్టొరీ V టక్ జగదీష్….కానీ!!

టక్ జగదీష్ మరియు లవ్ స్టొరీ ఈ రెండు సినిమాలు ఈ ఇయర్ మొదట్లో రిలీజ్ డేట్స్ అనౌన్స్ మెంట్ నుండి కూడా పోటి పడుతూనే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ లో ఒక వారం గ్యాప్ తో ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రెండు సినిమాలు రిలీజ్ డేట్స్ ని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పాలి.

ఇక డిజిటల్ లో రిలీజ్ చేయించడానికి ఈ రెండు సినిమాలకు కూడా అల్టిమేట్ OTT డీల్స్ వచ్చాయి కానీ లవ్ స్టొరీ ససేమీరా నో చెప్పి ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లోనే రావాలని ఫిక్స్ అవ్వగా టక్ జగదీష్ కూడా థియేటర్స్ లోకి రావాలని ఎంత ట్రై చేస్తున్నా కానీ…

చాలా టైం నుండి సినిమా పెండింగ్ లో ఉండటం తో ఫైనాన్స్ ఇబ్బందుల వలన సినిమా డిజిటల్ లోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు పోటి పడబోతున్నాయి అన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. లవ్ స్టొరీ సినిమా ఆడియన్స్ ముందుకు…

సెప్టెంబర్ 10 న రిలీజ్ అవ్వబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దాంతో సినిమా థియేటర్స్ లో వినాయక చవితి కానుకగా రిలీజ్ అవ్వడం కన్ఫాం అవ్వగా మరో పక్క నాని టక్ జగదీష్ సినిమా వినాయక చవితి కి డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది ఈ సినిమా పై… దాంతో రెండు సినిమాలు కూడా పోటి పడబోతున్నాయి కానీ…

అందులో ఒకటి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా మరో సినిమా డిజిటల్ లో రిలీజ్ కానుంది. టక్ జగదీష్ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి కానీ మేకర్స్ తప్పక డిజిటల్ వైపు అడుగు వేశారని సమాచారం. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ సినిమా వినాయక చవితికి డిజిటల్ లో రిలీజ్ అవ్వడం ఖాయమంటూ చెప్పుకుంటున్నారు ఇప్పుడు.

Leave a Comment