న్యూస్ స్పెషల్

మళ్ళీ కోపం తెచ్చుకున్న ప్రభాస్ ఫ్యాన్స్…UV క్రియేషన్స్ పై దండెత్తారు!!

పాపం అందరు హీరోల ఫ్యాన్స్ కి ఒక ప్రాబ్లం అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మరో ప్రాబ్లమ్, మిగిలిన హీరోల ఫ్యాన్స్ తమ హీరోలు ఇయర్ కి ఒకటి రెండు సినిమాలు తీయాలి అని, వాటి లుక్స్, అప్ డేట్స్, టీసర్స్ ట్రైలర్ సాంగ్స్ ఇలా వీటితో ఫుల్ హ్యాపెన్నింగ్ గా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటారు, కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడో రెండేళ్ళ కోసారి సినిమా వస్తే తప్పితే…

వాళ్ళ కి ఆ సినిమా గురించిన అప్ డేట్స్ రావు, బాహుబలి కి ముందు కూడా ప్రభాస్ స్లో గానే సినిమాలు చేసే వాడు కానీ ఏడాదికి ఒక సినిమా మినిమమ్ వచ్చేది, కానీ బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ అవ్వడమ్ తో ప్రాజెక్ట్ కి మరింత టైం పడుతుంది.

ఒక్కో సినిమా కి ఇప్పుడు రెండేళ్ళ కి మించి టైం పడుతుంది, దాంతో ఫ్యాన్స్ కోరుకునే అప్ డేట్స్ అస్సలు రావడం లేదు, ఇక ప్రభాస్ తో సాహో ఇప్పుడు ప్రభాస్ 20 మూవీ ని నిర్మిస్తున్న యు వి క్రియేషన్స్ వారు మొదట్లో మంచి అప్ డేట్స్ ఇచ్చేవారు కానీ..

ప్రభాస్ తో చేస్తున్న రీసెంట్ మూవీస్ విషయం లో మాత్రం తీవ్రంగా జాడ్యం చేస్తున్నారు, దాంతో చిర్రెత్తుకోచ్చిన ఫ్యాన్స్ ఇప్పుడు ఎదురు చూసి చూసి సోషల్ మీడియాలో మరో సారి యు వి క్రియేషన్స్ పై నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు. #WorstBannerUVCreations అంటూ భారీ ట్రెండ్ ని సోషల్ మీడియా లో చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

ఆల్ మోస్ట్ 4 లక్షల రేంజ్ లో ట్వీట్స్ ఈ ట్వీట్ పై పడ్డాయి అంటే ఏ రేంజ్ లో వారు రెచ్చిపోతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఉగాది టైం లో డైరెక్టర్ కూడా ఫస్ట్ లుక్ అప్ డేట్ ఉంటుంది అని చెప్పాడు, కానీ ఇప్పటి వరకు వాళ్ళ నుండి ఎలాంటి అప్ డేట్ లేదు, మధ్య లో సినిమా మొదలు పెట్టినప్పుడు దిగిన ఫోటోలు రిలీజ్ చేసినా అప్పటికే లేట్ అయింది. ఇక ఇప్పుడు చేస్తున్న భారీ ట్రెండ్ తో అయినా వాళ్ళ నుండి ఏమైనా అప్ డేట్ ఉంటుందో లేదో చూడాలి…

Leave a Comment