న్యూస్ బాక్స్ ఆఫీస్

మహర్షి డే 10 కలెక్షన్స్…మహేష్ వీరంగం ఈ రోజు!

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల్లో 79 కోట్లకు పైగా షేర్ ని అందుకుని దుమ్ము లేపగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 10 వ రోజు లో ఎంటర్ అవ్వగా తొలి రెండు షోలు స్లో గా నే మొదలు అయినా ఆక్యుపెన్సీ ఓవరాల్ గా 40% వరకు అన్ని చోట్లా కలుపుకుని ఉంది, ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల విషయం లో మాత్రం జోరు చూపింది.

అన్ని ఏ సెంటర్స్ లో అదిరిపోయే బుకింగ్స్ తో దుమ్ము లేపిన సినిమా సీడెడ్ కొన్ని మాస్ సెంటర్స్ లో డీసెంట్ లెవల్ లో హోల్డ్ చేసింది, మొత్తం మీద సినిమా కి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంది, విజయోత్సవ సభ ఎఫెక్ట్ పడకుండా ఉంటే కచ్చితంగా 10 వ రోజున…

రెండు తెలుగు రాష్ట్రాలలో 2 కోట్లకు పైగా షేర్ ని అందుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు. అది 9 వ రోజు తో పోల్చితే 30% కి పైగా గ్రోత్ అని చెప్పాలి. ఫైనల్ లెక్కలు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి మరింత పెరగడమో ఈ మార్క్ కి కొంచం అటూ ఇటూ గా ఉండటమో ఉంటుందని చెప్పాలి. మొత్తం మీద ఈ రోజు మహేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర వీరంగం ఆడాడు అని చెప్పాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!