న్యూస్ బాక్స్ ఆఫీస్

మహర్షి 3 వ రోజు కలెక్షన్స్..ఆ ఏరియా దెబ్బ కొట్టినా…నిలిచాడు!!

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమా మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో 43.5 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా మూడో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, కానీ సీడెడ్ అండ్ కొన్ని మాస్ సెంటర్స్ లో డ్రాప్స్ ఒక్కటే కొద్దిగా కలవర పెడుతున్నా ఓవరాల్ గా మిగిలిన ఏరియాల గ్రోత్ తో ఆ డ్రాప్స్ కూడా సినిమా మొత్తం మీద కవర్ చేసింది అని చెప్పాలి.

ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మహర్షి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అంచనాలను మించే విధంగా కలెక్షన్స్ ని అందుకుంటుంది, చాలా ఏరియాల్లో ఈ రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ అన్ని అమ్ముడు పోయాయి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అదే రేంజ్ లో ఉంటే గనుక…

7.5 కోట్ల నుండి 8 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకునే చాన్స్ ఉంది, అలా కాకపోయినా కానీ సినిమా 7 కోట్ల వరకు షేర్ ని అందుకోవచ్చు. మొత్తం మీద ఒక ఏరియా దెబ్బ కొట్టినా కానీ సూపర్ స్ట్రాంగ్ గా మిగిలిన ఏరియాలు ఉండటం తో మహర్షి మరోసారి అద్బుతమైన వసూళ్ళ ని అందుకునే దిశగా అడుగులు వేస్తుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!