న్యూస్ బాక్స్ ఆఫీస్

మహర్షి 7 వ రోజు ఓపెనింగ్స్…వీక్ డేస్ లో ఊచకోత!

కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ దూసుకు పోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు, సినిమా కి మొదటి రోజు వచ్చిన టాక్ కి ఈ కలెక్షన్స్ మాత్రం ఊహాతీతం అనే చెప్పాలి. 6 రోజుల్లో టోటల్ గా 72.6 కోట్ల కి పైగా షేర్ ని అందుకున్న మహర్షి సినిమా 7 వ రోజున కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా హోల్డ్ చేసింది, ముఖ్యంగా నైజాం ఏరియాలో సినిమా…

హోల్డ్ చేసిన తీరు అద్బుతం అనే చెప్పాలి, కానీ సీడెడ్ లో మాత్రం సినిమా భారీ ఎదురుదెబ్బే కొట్టింది, అయినా కానీ ఓవరాల్ గా మంచి వసూళ్ళ ని అందుకుంటున్న మహర్షి 6 వ రోజు తో పోల్చితే 7 వ రోజు డ్రాప్స్ 30% వరకు ఉన్నా కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ బాగుండటం తో…

7 వ రోజు రెండు రాష్ట్రాలలో మినిమం 2.6 కోట్ల నుండి 2.8 కోట్ల మధ్యలో షేర్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే సినిమా ఓవరాల్ గా 2.9 కోట్ల నుండి 3 కోట్ల కి వెళ్ళే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!