న్యూస్ బాక్స్ ఆఫీస్

మహర్షి 7 వ రోజు కలెక్షన్స్…ఏం కొట్టుడు సామి ఇది!

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషన్ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ కలెక్షన్స్ తో తొలి 6 రోజులలోనే ఏకంగా 72.6 కోట్లకు పైగా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా సినిమా ఇప్పుడు 7 వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకున్నా కానీ సాలిడ్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా బాగా హోల్డ్ చేసింది, ముఖ్యంగా నైజాం ఏరియా లో అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసింది సినిమా.

సీడెడ్ లో స్లో డౌన్ అవ్వగా ఓవరాల్ గా సినిమా 6 వ రోజు తో పోల్చితే కేవలం 30% లోపు డ్రాప్స్ ని ఆన్ లైన్ టికెట్ సేల్స్ ద్వారా సొంతం చేసుకుంది, ఇక సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగానే ఉన్నాయని అంటున్నారు. ఈవినింగ్ అండ్ నైట్ షోల పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది అంటుండటం తో…

సినిమా 7 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమం 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మరింత రెచ్చిపోతే ఈ లెక్క 2.9 కోట్ల నుండి 3 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది, మరి మొత్తం మీద సినిమా ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!