న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

మహర్షి Vs రంగస్థలం Vs భరత్ అనే నేను Vs అరవింద సమేత 10 డేస్ కలెక్షన్స్ కంపారిజన్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు రిలీజ్ అయిన సినిమాలలోప్రేక్షకుల మనసు గెలుచుకున్న పెద్ద సినిమాలు రంగస్థలం, భరత్ అనే నేను, అరవింద సమేత ఇప్పుడు మహర్షి. కాగా ఈ సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం 10 రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది, రంగస్థలం, భరత్ అనే నేను ఇప్పుడు మహర్షి కి సమ్మర్ హాలిడేస్ హెల్ప్ అయ్యాయి. అరవింద సమేత కి రెండో వారం దసరా సెలవులు హెల్ప్ అయ్యాయి.

మొత్తం మీద ఈ సినిమా 10 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…. రంగస్థలం 10 రోజులకు రెండు తెలుగు రాష్ట్రాలలో 67.26 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక భరత్ అనే నేను ట్రేడ్ లెక్కల్లో 57.28 కోట్ల షేర్ ని అందుకోగా అరవింద సమేత దసరా సెలవులలో దుమ్ము లేపి 67.23 కోట్ల షేర్ ని సాధించింది.

ఇక ఇప్పుడు మహర్షి సినిమా 10 రోజులలో 64.52 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…. రంగస్థలం 10 రోజులకు వరల్డ్ వైడ్ గా 91.5 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక భరత్ అనే నేను ట్రేడ్ లెక్కల్లో 83.62 కోట్ల షేర్ ని అందుకోగా అరవింద సమేత 91.2 కోట్ల షేర్ ని సాధించింది. 

ఇక ఇప్పుడు మహర్షి సినిమా 10 రోజులలో 81.63 కోట్ల షేర్ ని అందుకుంది… ఇక టోటల్ వరల్డ్ గ్రాస్ ని గమనిస్తే… రంగస్థలం 10 రోజులకు వరల్డ్ వైడ్ గా 148 కోట్ల గ్రాస్ ని అందుకుంది, ఇక భరత్ అనే నేను ట్రేడ్ లెక్కల్లో 138 కోట్ల గ్రాస్ ని అందుకోగా అరవింద సమేత 149 కోట్ల గ్రాస్ ని సాధించింది. 

ఇవీ మొత్తం మీద రీసెంట్ బిగ్ మూవీస్ 10 రోజుల కలెక్షన్స్ కంపారిజన్… మహర్షి కి ఓవర్సీస్ అలాగే సీడెడ్ ఎదురుదెబ్బ కొట్టి ఉండకపోతే మరింత జోరుగా కలెక్షన్స్ ని అందుకుని ఉండేది. ఇక లాంగ్ రన్ లో మహర్షి ఎంత దూరం వెళుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!