న్యూస్

మహా సముద్రం ఫస్ట్ టాక్…సెన్సార్ డీటైల్స్ అండ్ రిపోర్ట్!

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైం గా హిట్ కి దూరం అయిన శర్వానంద్, తెలుగు లో స్ట్రైట్ మూవీ చేసి చాలా టైం అయిన సిద్దార్థ్ ల కాంబినేషన్ లో RX100 డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మహా సముద్రం ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవ్వగా సినిమా సెన్సార్ పనులను కొంచం లేట్ గా సినిమా రిలీజ్ కి రెండు మూడు రోజుల ముందు…

జరుపుకోవడం జరిగింది, సెన్సార్ కంప్లీట్ చేసుకుని U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా 2 గంటల 35 నిమిషాల లెంత్ తో తెరకెక్కగా సెన్సార్ నుండి సినిమా కి మొదటి టాక్ ఏంటి అనేది కూడా ఫస్ట్ టాక్ ఇప్పుడు బయటికి వచ్చేసింది…

పూర్తిగా స్టొరీ రివీల్ చేయడం లేదు కానీ ఇద్దరు స్నేహితులు బద్ద శత్రువులుగా మారాల్సి వస్తుంది, అది కూడా ఒక అమ్మాయి కారణంగా జరుగుతుంది, మరి అలా శత్రువులు అయ్యాక వీళ్ళు చేసిన పని ఏంటి, చివరికి ఏం అయ్యారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు. కథ పాయింట్ కొంచం రొటీన్ గా అనిపించినా…

స్క్రీన్ ప్లే అండ్ ట్విస్ట్ లు బాగా ఆకట్టుకుంటాయని, రావ్ రమేష్ మరియు జగపతిబాబుల రోల్స్ చాలా బాగోచ్చాయని, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు. కొంచం లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగినా ఇంటెన్స్ రా రస్టిక్ యాక్షన్ డ్రామాగా మహా సముద్రం ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఫైనల్ గా టాక్ ఏంటి అంటే మాత్రం…

ఎబో యావరేజ్ టు హిట్ రేంజ్ లో సినిమా ఉంటుందని అంటున్నారు… ఓవరాల్ గా సినిమా రిలీజ్ అయ్యాక ఈ రేంజ్ టాక్ ని ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటే శర్వానంద్ కి సిద్దార్థ్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందో చూడాలి.

Leave a Comment