న్యూస్ స్పెషల్

మహేష్ ఫ్యాన్సా మజాకా…వరల్డ్ రికార్డ్ కొట్టారు…మరీ 100M ఏంటి సామి!!

అందరు ఫ్యాన్స్ ఒకెత్తు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు, సోషల్ మీడియాలో మిగిలిన హీరోల ఫ్యాన్స్ కన్నా ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ వస్తారు మహేష్ బాబు ఫ్యాన్స్, సోషల్ మీడియా రికార్డుల విషయం లో కూడా ఎప్పటి కప్పుడు రికార్డులు సృష్టించే మహేష్ బాబు ఫ్యాన్స్ రీసెంట్ గా ఏకంగా ఆల్ టైం రికార్డులే కాదు ఏకంగా వరల్డ్ రికార్డ్ ను…

నమోదు చేసి సంచలనం సృష్టించారు. బహుశా వరల్డ్ లోనే ఇప్పటి వరకు ఇలాంటి రికార్డ్ ను ఎవ్వరూ సాధించి ఉండరు, ఫ్యూచర్ లో సాధిస్తారో లేదో కూడా డౌటే అనిపించే రేంజ్ రికార్డ్ ను సొంతం చేసుకున్నారు, ఇంతకీ ఆ రికార్డ్ ఏంటి అంటే… సూపర్ స్టార్ మహేష్…

ఇప్పుడు బాక్ టు బాక్ హాట్రిక్ హిట్ మూవీస్ తర్వాత చేస్తున్న కొత్త సినిమా సర్కారు వారి పాట సినిమాను లాస్ట్ ఇయర్ కృష్ణగారి పుట్టిన రోజు టైం లోనే అనౌన్స్ చేయగా అప్పటి నుండి టైటిల్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఆ టైటిల్ పై మిలియన్స్ కి మిలియన్స్ ట్వీట్స్ సోషల్ మీడియా లో..

పోల్ చేస్తూ ఉండగా సరిగ్గా సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయిన టైం కి ఏకంగా 100 మిలియన్స్ ట్వీట్స్ ని కంప్లీట్ చేసుకుని వరల్డ్ లోనే ఒక సినిమా టాగ్ పై 100 మిలియన్స్ ట్వీట్స్ ని  సొంతం చేసుకున్న మొట్ట మొదటి సినిమా హాష్ టాగ్ గా సర్కారు వారు పాట సినిమా హాష్ టాగ్ ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే…

సినిమా ఇంకా రెగ్యులర్ షూటింగ్ ఇప్పుడే మొదలు కాగా ఇంకా షూటింగ్ అయిపోయి రిలీజ్ అవ్వడానికి చాలా టైం ఉన్నా ఈ లోపే ఇలాంటి రికార్డ్ ను సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. మొత్తం మీద మహేష్ ఫ్యాన్స్ దెబ్బకి వరల్డ్ రికార్డ్ వచ్చి చేరింది ఇప్పుడు ఈ సినిమా పై. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో దుమ్ము లేపుతుందో చూడాలి.

Leave a Comment