గాసిప్స్ న్యూస్

మహేష్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్…ఆ రోజు కష్టమే ఇక!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ మూడు వరుస విజయాలతో సూపర్ డూపర్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే, భరత్ అనే నేను, మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరు సినిమా లతో విజయాల తర్వాత సూపర్ స్టార్ చేయబోయే అప్ కమింగ్ మూవీ రేసు లో చాలా మంది డైరెక్టర్స్ నిలిచినా కానీ చివరికి గీత గోవిందం ఫేం పరశురాం ఫైనల్ అయ్యారు.

కాగా ఈ సినిమా అటు ఫ్యాన్స్ ని ఇటు మహేష్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ అలరించే కథ తో తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమా ఆల్ మోస్ట్ అఫీషియల్ గా కన్ఫాం అయినా కానీ ఓపెన్ గా సినిమా ఇంకా పూజా కార్యక్రమాలు జరుపుకుని మొదలు అవ్వాల్సి ఉంది.

ప్రతీ ఇయర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కి తన అప్ కమింగ్ మూవీస్ ప్రారంభం కానీ టైటిల్ అనౌన్స్ మెంట్ కానీ కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ కానీ ఎదో ఒకటి కంపల్సరీ గా చేసే అలవాటు ఉన్న మహేష్ ఈ ఇయర్ కృష్ణ బర్త్ డే కి సినిమా ను అఫీషియల్ గా…

అనౌన్స్ చేసి టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా చేస్తారనే టాక్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టగా ఇప్పుడు అందులో నిజానిజాలు చాలా తక్కువే అని తెలుస్తుంది, లాస్ట్ ఇయర్ కృష్ణ గారి భార్య విజయనిర్మల గారు చనిపోవడం ఇంకా ఏడాది పూర్తీ కాకపోవడం తో ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండబోతున్నట్లు కృష్ణ గారు అనౌన్స్ చేశారట.

దాంతో ఇప్పుడు ఆ రోజున మహేష్ కూడా తన అప్ కమింగ్ మూవీ ని మొదలు పెట్టడని అంటున్నారు. ఒకవేళ మొదలు పెట్టినా టైటిల్ అనౌన్స్ మెంట్ లాంటివి ఉండకుండా ఫార్మల్ గా స్టార్ట్ చేస్తారని, డానికి కూడా తక్కువ అవకాశమే ఉందని అంటున్నారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ కి ఇది కొద్దిగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఇది 100% నిజం అవుతుందో లేదో మే 31 న తేలనుంది…

Leave a Comment