గాసిప్స్ న్యూస్

మహేష్27-టైటిల్ ఇదేనా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు యమ జోరు మీదున్న విషయం తెలిసిందే, ఒకటి తర్వాత ఒకటి వరుసగా మూడు హిట్లు కొట్టి సూపర్బ్ ఫాం లో దూసుకు పోతున్న మహేష్ బాబు ఈ ఇయర్ సంక్రాంతి బరిలో అల వైకుంఠ పురం లో నుండి తీవ్ర పోటి ని ఎదురు కుని కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపి మహేష్ కెరీర్ లో సరికొత్త రికార్డులు నమోదు చేసింది.

ఇక ఈ సినిమా విజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని 3 నెలలుగా రెస్ట్ తీసుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన అప్ కమింగ్ మూవీ ని ఆల్ మోస్ట్ కన్ఫాం చేశాడు. సెన్సిబుల్ డైరెక్టర్ పరశురాం కి తన కెరీర్ లో 27 వ సినిమా డైరెక్షన్ పనులను అప్పగించాడు.

గీత గోవిందం తో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న తర్వాత దాదాపు రెండేళ్ళు కథ సిద్ధం చేసిన పరశురామ్ చెప్పిన కథ ని ఫైనల్ చేసిన మహేష్ బాబు ఈ నెల 31 న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా ఫార్మల్ గా ఈ సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.

టాలీవుడ్ బజ్ ప్రకారం “14 రీల్స్ అండ్ మైత్రి మూవీ మేకర్స్” కలిసి ఈ సినిమా ని నిర్మిస్తారని అంటున్నారు, ఇక సంగీత దర్శకత్వం తమన్ అందించబోతున్నాడట. హీరోయిన్స్ ఇంకా కన్ఫాం కాలేదు కానీ పూజా హెడ్గే మరియు కియరా అద్వాని లలో ఒకరు కన్ఫాం అయ్యే అవకాశం ఉందని చెబుతుండగా సినిమా టైటిల్ కన్సిడరేషన్ లో ఉన్న టైటిల్ కూడా రివీల్ అయింది.

దాని ప్రకారం ఈ సినిమా కి “సర్కార్ వారి పాట” అనే టైటిల్ ని అనుకుంటున్నారని బజ్ ఉంది, ఇవి మొత్తం మీద ఇప్పటి వరకు సినిమా పై లేటెస్ట్ బజ్ విశేషాలు, ఇంకా మరిన్ని విశేషాలు అన్నీ సినిమా ఈ నెల 31 న ఫార్మల్ లాంచ్ లో తెలిసీ అవకాశం ఉందని సమాచారం…

Leave a Comment