న్యూస్

మాస్టర్ టీం దిమ్మ తిరిగే షాక్…షాక్ లో ఇండస్ట్రీ!!

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ మరియు విజయ్ సేతుపతి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ లో భారీ లెవల్ లో రిలీజ్ అయ్యి సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. సినిమా విజయ్ కెరీర్ లో మరో 200 కోట్ల మూవీ గా నిలిచి బాక్ టు బాక్ 4 సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర…

200 కోట్ల మార్క్ ని అందుకున్న రికార్డ్ ను సొంతం చేసుకోగా… లాంగ్ రన్ లో మరింత జోరు చూపుతుంది అని అంతా భావిస్తూ ఉండగా టోటల్ ఇండస్ట్రీకే షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్ కి అందరికీ భారీగా కోపం తెప్పించింది మాస్టర్ టీం…

దానికి కారణం సినిమా డిజిటల్ రిలీజ్ కన్ఫాం అవ్వడమే, సినిమా డిజిటల్ రిలీజ్ 29 వ తేదీనా రిలీజ్ కాబోతుంది. కానీ ప్రీమియర్స్ 28 వ రాత్రి 10:30 నిమిషాలకు రిలీజ్ కాబోతుందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఇచ్చేశారు…

అంటే సినిమా రిలీజ్ అయిన కేవలం 16 రోజుల గ్యాప్ లో డిజిటల్ ప్రీమియర్ ను సొంతం చేసుకోబోతుంది అన్న మాట… సినిమాను అందరూ ఫిబ్రవరి 12 న డిజిటల్ రిలీజ్ అవుతుంది అని చెప్పారు కానీ ఆ టైం లో ప్రైమ్ లో మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరిస్ ఫ్యామిలీ మాన్ 2 రిలీజ్ కాబోతుంది, కాబట్టి క్లాష్ ఎందుకు అనుకున్నారు. అండ్ ఈ సినిమా కి అమెజాన్ ప్రైమ్ ఆల్ టైం రికార్డ్ రేటుని…

చెల్లించడంతో ఒప్పందంలో 2 వారల తర్వాత ఎప్పుడైనా డిజిటల్ రిలీజ్ చేస్తామని చెప్పారట. ఆ ఒప్పందం తోనే సినిమా రిలీజ్ అయిందని అంటున్నారు. దాంతో మాస్టర్ తో థియేటర్స్ తిరిగి కళకళలాడుతున్నాయి అని భావించినా ఈ నిర్ణయంతో ఇప్పుడు టీం పై తీవ్ర కోపంగా ఉన్నారు. సినిమా చూడని వాళ్ళు మాత్రం సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

Leave a Comment