న్యూస్ బాక్స్ ఆఫీస్

మాస్టర్@200….ఇండియాలోనే కాదు వరల్డ్ లోనే రికార్డ్ ఇది!

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ అంచనాలతో బరిలోకి దిగింది, సినిమా పై ఉన్న క్రేజ్ మరో లెవల్ లో ఉండటం తో అడ్వాన్స్ బుకింగ్స్ మరో లెవల్ లో బుక్ అవ్వగా సినిమా రిలీజ్ అయ్యాక యావరేజ్ రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకుంది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆ ఇంపాక్ట్ ఇసుమంత కూడా కనిపించలేదు.

సినిమా ఓపెనింగ్స్ అటు తమిళ్ లో ఇటు తెలుగు లో రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో రాగా తర్వాత టాక్ స్ప్రెడ్ అయ్యి సినిమా స్లో అవుతుంది అని అనుకున్నారు కానీ సినిమా ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు ని కొనసాగీస్తూ మొదటి వారంలోనే…

180 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోగా ఇప్పుడు రెండో వారం లో సినిమా 10 రోజుల లోపే బాక్స్ ఆఫీస్ దగ్గర మరిన్ని మైలురాయిని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. సినిమా ఆల్ రెడీ తమిళ్ నాడు లో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా…

వరల్డ్ వైడ్ గా టోటల్ గ్రాస్ ఇప్పుడు 200 కోట్ల మార్క్ ని అందుకుని వరల్డ్ వైడ్ గా సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్టర్ రిలీజ్ టైం లో ఉన్న పాండమిక్ దృశ్యా ఇండియాలోనే ఇది రికార్డ్ కాకుండా వరల్డ్ లో కూడా ఏ సినిమా ఈ టైం లో ఇలాంటి కలెక్షన్స్ ని అందుకోలేదు. దాంతో వరల్డ్ లోనే ప్రస్తుతం హైయెస్ట్ కలెక్షన్స్ తో…

దూసుకు పోతున్న సినిమాగా నిలిచింది మాస్టర్ మూవీ… 50% లిమిటేషన్లు ఉన్నా ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ తో పాటు 200 కోట్ల మార్క్ ని కూడా అందుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసిన మాస్టర్ ఫైనల్ రన్ లో మరింత దూరం వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment