గాసిప్స్ న్యూస్

మాస్ మహారాజ్ మూవీ లో మెగా హీరో…!!

రాజా ది గ్రేట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ తర్వాత మాత్రం ఆ ఫాం ని కొనసాగించ లేక పోయాడు, చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవుతూ రాగా, ప్రస్తుతం 4 వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న రవితేజ తన ఆశలన్నీ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ క్రాక్ మీదే పెట్టుకున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా లాక్ డౌన్ వలన రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వగా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుంది అన్నది చెప్పలేని పరిస్థితి, ఇదే సమయం లో రవితేజ మాత్రం తన అప్ కమింగ్ మూవీస్ ని కమిట్ అయ్యే పనిలో ఉన్నాడు.

ముందుగా త్రినాధ రావ్ నక్కిన డైరెక్షన్ లో తన అప్ కమింగ్ మూవీ ఆల్ మోస్ట్ కన్ఫాం అవ్వగా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్క బోతుందని సమాచారం. ఇక ఈ సినిమా లో రవితేజ తో పాటు ఓ స్పెషల్ క్యామియో రోల్ లో…

మెగా హీరో నటించే అవకాశం ఉందని చెబుతున్నారు, ఆ రోల్ సుమారు 15 నిమిషాల నుండి 20 నిమిషాల వ్యవధిలో ఉంటుందని, ఆ రోల్ కి గాను డైరెక్టర్ సుప్రీం హీరో సాయి ధరం తేజ్ ని అప్రోచ్ అవ్వగా తను ఓకే చెప్పారని టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, లాక్ డౌన్ తర్వాత…

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని, అందులో నే ముందుగా రవితేజ మరియు సాయి ధరం తేజ్ ల కాంబో లో ఆ సీన్స్ ని చిత్రీకరిస్తారని అంటున్నారు. రీసెంట్ టైం లో రవితేజ మూవీస్ లో ఎంటర్ టైన్ మెంట్ తగ్గుతూ వస్తుంది, ఈ మూవీ పక్కా ఎంటర్ టైనర్ అని చెబుతుండటం తో టాక్ బాగుంటే రవితేజ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు…

Leave a Comment