టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

మాస్ మహారాజ్ “రవితేజ” కెరీర్ లో ఆల్ టైం టాప్ 10 మూవీస్

ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏ రోల్స్ వస్తే ఆ రోల్స్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి సింధూరం సినిమాతో హీరోగా మారి నీకోసం సినిమాతో తొలి హిట్ అందుకుని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం-ఇడియట్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో తనని తాను ఎస్టాబ్లేష్ చేసుకున్న సెల్ఫ్ మేడ్ స్టార్ రవితేజ. కెరీర్ లో ఎన్నో ఎత్తుఫల్లాలు వచ్చినా ఎప్పుడు చిరునవ్వుతో ఎదుర్కొనే రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా…

హిట్స్ కి ఫ్లాఫ్స్ కి ఏమాత్రం మార్కెట్ ని కోల్పోకుండా కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు, ఈ మధ్య సినిమాల సంఖ్యని తగ్గించినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టిన ప్రతీ సారి దుమ్ము లేపే సంచలనాలను సృష్టించాడు మాస్ మహారాజ్…

ఇక రీసెంట్ టైం లో వరుస పెట్టి 4 డిసాస్టర్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకున్నా కానీ క్రాక్ సినిమా తో 50% ఆక్యుపెన్సీ తోనే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని తన కెరీర్ లో ఆల్ టైం నంబర్ 1 మూవీ ని సొంతం చేసుకున్నాడు… దాంతో రవితేజ కెరీర్ టాప్ లిస్టు మారింది…

ఒకసారి మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లో ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో టాప్ 10 షేర్ మూవీస్ ని గమనిస్తే…
క్రాక్(2021)—–39.16కోట్లు(డబుల్ బ్లాక్ బస్టర్)
రాజా ది గ్రేట్(2017)—-31 కోట్లు(హిట్)
బలుపు(2013)————29.30 కోట్లు{బ్లాక్ బస్టర్}
పవర్(2014)————-27.54 కోట్ల{హిట్}
కిక్(2009)————24 కోట్లు{బ్లాక్ బస్టర్}
బెంగాల్ టైగర్(2015)————22.50 కోట్లు{సెమీ హిట్}
మిరపకాయ్(2011)———-21.50 కోట్లు{సూపర్ హిట్}
డాన్ శీను(2010)———–21 కోట్లు{సూపర్ హిట్}
విక్రమార్కుడు(2006)———-20.64 కోట్లు{బ్లాక్ బస్టర్}
కిక్ 2(2015)————-19.60 కోట్లు{డిసాస్టర్}
కృష్ణ(2008)———–18.20 కోట్లు{సూపర్ హిట్}
వెంకీ(2004)————16 కోట్లు{బ్లాక్ బస్టర్}

ఇవి రవితేజ కెరీర్ లో టాప్ 12 బిగ్గెస్ట్ గ్రాసర్స్. ఇందులో ఒక్క కిక్ 2 ఒక్కటే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది బెంగాల్ టైగర్ హిట్ కి క్లోజ్ గా వచ్చింది…. కానీ మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులను అలరించి మంచి కలెక్షన్స్ ని సాధించాయి. ఇప్పుడు రెట్టించిన స్పీడ్ తో వస్తున్న రవితేజ సినిమాల్లో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

Leave a Comment