గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

మిర్చి రికార్డ్ కొట్టే దమ్ము…వీటికి ఉందా!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత థియేటర్స్ మళ్ళీ వెలవెలబోతున్నాయి, చిన్న సినిమాలు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆశించిన మేర కలెక్షన్స్ ని ఆ సినిమా లు సొంతం చేసుకోవడం లేదు, ఇలాంటి టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం సందడి తేవడానికి 2 మీడియం రేంజ్ హీరోల సినిమా లు ఇప్పుడు వారం గ్యాప్ తో రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. అవే విజయ్ దేవరకొండ నటించిన…

వరల్డ్ ఫేమస్ లవర్ కాగా మరోటి నితిన్ నటించిన భీష్మ సినిమా… రెండు సినిమాలకు ట్రేడ్ లో అయితే మంచి బజ్ ఉంది కానీ అది థియేటర్స్ దగ్గర జనాలను ఎంతవరకు భారీ సంఖ్య లో తెప్పిస్తుందో అనేది ఆసక్తి కరం, ఇప్పుడు వీటితో పాటు మరో ఆసక్తి కరమైన అంశం ఒకటి చక్కర్లు కొడుతుంది.

టాలీవుడ్ లో మంత్ వైస్ హైయెస్ట్ షేర్ సాధించిన సినిమాల పరంగా ఫిబ్రవరి విషయం లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమా బిగ్గెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమా 48.5 కోట్ల షేర్ తో టాప్ లో ఉంది, ఎన్టీఆర్ టెంపర్ 44 కోట్లు+ ఈ రికార్డ్ ను మిస్ అయింది.

కానీ విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ గీత గోవిందం 70.4 కోట్లు, నితిన్ కెరీర్ బెస్ట్ అ.ఆ 49 కోట్లు+ అవ్వడం తో ఇది వరకే వీరు ఈ కలెక్షన్ ని అందుకున్న వాళ్ళే కాబట్టి ఇప్పుడు వీళ్ళ సినిమా కనుక హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే మిర్చి సినిమా రికార్డ్ ను బ్రేక్ చేస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మిర్చి సినిమా రిలీజ్ అయ్యి రీసెంట్ గా 7 ఏళ్ళు పూర్తీ చేసుకుంది, 7 ఏళ్ళు అవుతున్నా మిర్చి సినిమా ఫిబ్రవరి హైయెస్ట్ షేర్ మూవీ గానే కొనసాగుతుండటం విశేషం. మరి ఈ 2 సినిమాల్లో ఏదైనా మిర్చి రికార్డ్ ను బ్రేక్ చేసే దమ్ము ఉందా లేదా అన్నది కొన్ని రోజుల్లో తేలిపోతుంది అని చెప్పొచ్చు.

Leave a Comment