న్యూస్ బాక్స్ ఆఫీస్

మీకు మాత్రమె చెబుతా కలెక్షన్స్: టార్గెట్ 2.5 కోట్లు…3 రోజుల్లో వచ్చింది ఇది!!

టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి నిర్మించిన లేటెస్ట్ మూవీ మీకు మాత్రమే చెబుతా, తనకి కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ని మెయిన్ లీడ్ లో పెట్టి కౌశిక్ కామెడీ తో ఆకట్టుకున్న ఈ సినిమా మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో పర్వాలేదు బాగుంది అనిపించే టాక్ ని ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు.

టాలీవుడ్ న్యూస్ ప్రకారం సినిమా ను సుమారు 2 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందినట్లు సమాచారం. కాగా సినిమా థియేట్రికల్ బిజినెస్ ఓవరాల్ గా 2.1 కోట్ల రేంజ్ లో జరగగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా 2.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది.

మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 45 లక్షల లోపు ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమా రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించుకునే వసూళ్లు సాధించింది, మూడో రోజు కొంచం బెటర్ వసూళ్లు రాగా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇవి సరిపోవు అనే చెప్పాలి.

మొత్తం మీద సినిమా 3 రోజుల కలెక్షన్స్ సమ్మరీ ఈ విధంగా ఉంది..
#MeekuMaathrameCheptha Day 3 Ap-TG: 0.33Cr
?Total 3 Days ApTg Collections: 0.86Cr
?Day 3 WW collections: 0.40Cr
?Total 3 Days WW collections: 1.11Cr
?Break Even: 2.5cr~
Need:- 1.39Cr needed for Break Even
?Total Gross: 1.90C+…. ఇదీ ఓవరాల్ గా 3 రోజుల్లో మీకు మాత్రమె చెబుతా సినిమా కలెక్షన్స్ రిపోర్ట్..

సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 1.4 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, అంటే వీకెండ్ తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా సినిమా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది, మరి మొదటి వారం పూర్తీ అయ్యే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment