గాసిప్స్ న్యూస్

మూడింటిలో మనదే బెస్ట్ అని తేల్చేశారు….మాస్…ఊరమాస్!!

ఒక సినిమా ఇతర భాషల్లో రీమేక్ చేయడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది, అలా జరిగినప్పుడు రీమేక్ లతో ఒరిజినల్ ని కంపేర్ చేయడం అన్నది కూడా కామన్ అనే చెప్పాలి. ఒరిజినల్ తో రీమేక్ ని కంపేర్ చేసి ఏ వర్షన్ బాగుంది లాంటి చర్చలు అనేక సార్లు జరగడం మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ రన్ తర్వాత…

డిజిటల్ రిలీజ్ ను రీసెంట్ గా సొంతం చేసుకోవడం తో మూడు వర్షన్ లు కూడా అందరికీ డిజిటల్ గా అందుబాటు లోకి వచ్చాయి. బాలీవుడ్ పింక్ మూవీ, తమిళ్ లో అజిత్ చేసిన నేర్కొండ పార్వాయి ఇక పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్ సినిమాలు…

మూడు చూసిన వాళ్ళు ఇప్పుడు మూడింటిలో అసలు బెస్ట్ ఏది అంటూ సోషల్ మీడియా చర్చలు మొదలు పెట్టగా, ఒరిజినల్ పింక్ కంప్లీట్ గా సీరియస్ నోట్ తో సాగే సినిమా కాగా రీచ్ కొద్ది వరకు మాత్రమే ఉండగా తమిళ్ లో అజిత్ చేసిన నేర్కొండ పార్వాయి కూడా…

ఆల్ మోస్ట్ సీరియస్ గానే సాగే కథ కాగా ఆ సినిమా మంచి రీజ్ నే సొంతం చేసుకున్నప్పటికీ కూడా సీరియస్ కి సీరియస్ కమర్షియల్ టచ్ కూడా జోడించిన వకీల్ సాబ్ కి ఇప్పుడు అన్ని వర్షన్ ల లోకి బెస్ట్ రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. మూడింటిలో కూడా కథ పాయింట్ ని డీవియేట్ చేయకుండా కథని డెవెలప్ చేసే సీన్స్ ని రాసుకున్నా…

వాటికి ఎలివేషన్ లు పెర్ఫెక్ట్ గా సెట్ అయిన సినిమా వకీల్ సాబ్ అని అందరూ మూడు సినిమాల్లో వకీల్ సాబ్ కే ఓటు వేస్తున్నారు. రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న వకీల్ సాబ్ సినిమా కి సెన్సేషనల్ వ్యూస్ కౌంట్ లభించింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ లెక్కలు ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది…

Leave a Comment