న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

మూడు సినిమాలు 540+….సూపర్ స్టార్ రాంపేజ్ ఇది!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు యమ జోరు మీదున్నాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఒకటి తర్వాత ఒకటి వరుస విజయాలతో దూసుకు పోతున్న మహేష్ బాబు లాస్ట్ మూడు సినిమాలుగా ఒకటి మించి ఒకటి హైయెస్ట్ షేర్ మూవీస్ తో సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతున్నాడు. భరత్ అనే నేను టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ఇప్పటికీ రిలీజ్ కాక పోవడం తో ఎవరి లెక్కల్లో వాళ్ళు…

ట్రేడ్ కలెక్షన్స్ ని చెబుతుండగా నిర్మాతలు మూడు వారాల్లో 205 కోట్లు అంటూ పోస్టర్ వదిలి తర్వాత సైలెంట్ అయిపోయారు.. కానీ ట్రేడ్ లో సినిమా 170 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసినట్లు అంచనా… ఇక తర్వాత మహేష్ 25 వ సినిమా..

మహర్షి రాగా యావరేజ్ రివ్యూ లతో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించిన ఆ సినిమా టోటల్ రన్ లో 175 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది. ఇక లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో హిస్టారికల్ 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించింది.

దాంతో మహేష్ లాస్ట్ మూడు సినిమాల గ్రాస్ లెక్కలు ఏకంగా 540 కోట్ల మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. టాలీవుడ్ లో ప్రభాస్ తప్పితే మరే హీరో నటించిన లాస్ట్ 3 సినిమాల కలెక్షన్స్ మహేష్ లాస్ట్ 3 సినిమాల కలెక్షన్స్ దరిదాపుల్లోకి లేకపోవడం సూపర్ స్టార్ రాంపేజ్ కి నిదర్శనం అని చెప్పాలి.

మొత్తం మీద లాంగ్ రన్ లో మరింత దూరం వెళ్లనున్న సరిలేరు నీకెవ్వరు టాలీవుడ్ చరిత్రలో నాన్ బాహుబలి మూవీస్ లో ఇప్పుడు అల వైకుంఠ పురం లో తర్వాత స్థానం దక్కించుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మహేష్ అప్ కమింగ్ మూవీస్ మినిమమ్ యావరేజ్ గా ఉన్నా మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవడం ఖయామని చెప్పొచ్చు.

Leave a Comment