న్యూస్ బాక్స్ ఆఫీస్

మూడు సినిమాల 2nd డే బాక్స్ ఆఫీస్ స్టేటస్…ఏంటి సామి ఇది!!

బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రెండు డబ్బింగ్ మూవీస్ అండ్ ఒక స్ట్రైట్ మూవీ రిలీజ్ అవ్వగా దీపావళి హాలిడే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలలో ఏమాత్రం ఇంపాక్ట్ ని ఈ సినిమాలు క్రియేట్ చేయలేక పోయాయి. 2 సినిమాలు అంచనాలను తప్పగా మరో సినిమా మాత్రం అంచనాల కన్నా కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది. ఇక రెండో రోజు నుండి వీకెండ్ స్టార్ట్ అయినా…

ఫ్రైడే చాలా చోట్ల వర్కింగ్ డే నే కాబట్టి మూడు సినిమాలు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి. మంచి రోజులు వచ్చాయి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఆల్ మోస్ట్ 40% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.

దాంతో సినిమా ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 45-50 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 50 లక్షలకు పైగా కలెక్షన్స్ రావొచ్చు. ఇక రజినీ నటించిన పెద్దన్న సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 45-50% వరకు…

డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ కనిపించినా కానీ అది సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకునే రేంజ్ లో అయితే లేదు, ఓవరాల్ గా ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 60-70 లక్షల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 80 లక్షలకు పైగా కలెక్షన్స్ ని అందుకోవచ్చు.

ఇక విశాల్ ఆర్య ల ఎనిమీ సినిమా రెండో రోజు ఆల్ మోస్ట్ 30% వరకు డ్రాప్ అయ్యి మిగిలిన సినిమాల కన్నా బెటర్ అనిపించుకోగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 50-60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని సినిమాల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై ఈ లెక్క మించి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి.

Leave a Comment