న్యూస్

మెగాస్టార్ చిరంజీవి పై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

ఇది వరకు మా ఎలక్షన్స్ ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా ఏక పక్షంగా జరుగుతూ వచ్చేవి…దాంతో అసలు జనలాకు సినిమా వాళ్ళకి ఇలాంటి ఎలక్షన్స్ కూడా ఉంటాయా అన్న డౌట్స్ ఉండేవి, కానీ 2018 టైం లో నరేష్ మరియు శివాజీ రాజా ల ఎలక్షన్స్ పోటి మా ఎలక్షన్స్ గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసేలా చేయగా సినిమా వాళ్ళు కూడా ఇలా ఎలక్షన్స్ కోసం కొట్టుకుంటారా అని తెలిసింది. ఇక ఇప్పుడు…

లేటెస్ట్ గా జరిగిన ఎలక్షన్స్ ప్రతీ రోజూ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే, ప్రకాష్ రాజ్ కి మంచు విష్ణు కి జరిగిన అధ్యక్ష పోటి లో చివరికి మంచు విష్ణు గెలిచి మా అద్యక్షుడుగా నిలవగా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అందరికీ థాంక్స్ చెప్పుకున్నాడు…

అందులో భాగంగా మాటలో మాటగా అసలు ఎలక్షన్స్ లో దిగాలి అని అనుకున్నప్పుడు తన తండ్రి మోహన్ బాబు కి చిరంజీవి గారి నుండి ఫోన్ వచ్చిందని, ప్రకాష్ రాజ్ ని యునానిమస్ గా ఎన్నుకుంటామని మంచు విష్ణుని దిగిపోమని చెప్పారు అంటూ మంచు విష్ణు కామెంట్స్ చేశారు…

దాంతో మెగాస్టార్ పై మంచు విష్ణు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవ్వగా పెళ్ళిసందడి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిన్న ఎలక్షన్స్ కోసం ఇలా మనలో మనం గొడవ పడటం ఏంటి అంటూ చెప్పిన మెగాస్టార్ కామెంట్స్ కి ఈ కామెంట్స్ కి లింక్ పెడుతూ అలా ఎలా అంటారు అంటూ విమర్శలు వస్తున్నాయి… ఇది కాయిన్ కి ఇటు వైపు అయితే…

మరో వైపు నుండి చూస్తె… లాస్ట్ టైమే ఎలక్షన్స్ విషయంలో నానా రచ్చ జరిగింది, ఈ సారి అలా అవ్వకూడదు అన్న భావనతో ఎవరినో ఒకరిని యునానిమస్ గా ఎంచుకుంటే అయిపోతుంది అన్న భావనతో చిరు అలా కామెంట్స్ చేశారని, కానీ ఇద్దరు అభ్యర్ధులు వినక పోవడంతో ఇక మీ ఇష్టం అంటూ చిరు చెప్పుకొచ్చారని అంటున్నారు. ఫైనల్ గా మంచు విష్ణు ఇప్పుడు మా అధ్యక్షుడిగా గెలవడంతో ఆంధ్రలో టికెట్ రేట్లపై ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా CM తో మాట్లాడి పరిస్థితులు నార్మల్ చేస్తారు అని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు…

Leave a Comment