గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

మెగాస్టార్ పేరుకున్న పవర్…సౌత్ లో న్యూ రికార్డ్!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన ఖైదీ నంబర్ 150 సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోగా ఆ సినిమా తర్వాత చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహా రెడ్డి పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా తో మరోసారి మెగాస్టార్ రేంజ్ ఏంటి అనేది క్లియర్ గా రివీల్ అయ్యింది. సినిమా రిలీజ్ కి ఇంకా కొన్ని వారలే సమయం ఉండగా…

ఆల్ మోస్ట్ బిజినెస్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని కూడా కంప్లీట్ చేసుకుంది, ఆ రైట్స్ విషయం లో సౌత్ లో అన్ని సినిమాల కన్నా హైయెస్ట్ రేటు ని సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది ఈ సినిమా. సినిమా అన్ని భాషలు కలిపి…

స్ట్రీమింగ్ రైట్స్ ఏకంగా 40 కోట్లకు పలికిందట. ఇది ఆల్ టైం రికార్డ్ గా చెబుతున్నారు. ఇది వరకు రోబో 2.0 సినిమా స్ట్రీమింగ్ రైట్స్ సౌత్ భాషలకు కలిపి 35 కోట్లకు అమ్ముడు పోయిందట. కాగా ఇప్పుడు సైరా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.

ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 18 న నిర్వహించబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కాగా ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్ ఎస్ రాజమౌళి ఇలా స్పెషల్ గెస్టులు చాలా మందే రాబోతున్నట్లు సమాచారం. ఇక ఇదే ఈవెంట్ లో సినిమా…

థియేట్రికల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం, ఆ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా పై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయమని చెబుతున్నారు. మరి సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా దుమ్ము లేపుతుండటం తో ట్రైలర్ తో అంచనాలు మరింత పెరిగితే బాక్స్ ఆఫీస్ రికార్డుల వర్షం కురవడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!