గాసిప్స్ న్యూస్

మొన్న ట్రోల్ చేశారు…ఇవాళ నేషనల్ వైడ్ ట్రెండ్ చేశారు

అఫీషియల్ పోస్టర్స్ అలాగే వర్కింగ్ స్టిల్స్ కి చాలా తేడా ఉంటుంది, కొందరు ప్రొడక్షన్ వాళ్ళు రిలీజ్ చేసే పోస్టర్స్ లో చాలా క్వాలిటీ మెయిన్ టైన్ చేస్తూ ఉంటారు, కొందరు మాత్రం ఎలాంటి క్వాలిటీ మెయిన్ టైన్ చేయకుండానే పోస్టర్స్ ని రిలీజ్ చేసి ట్రోల్ కి గురి అవుతారు. రీసెంట్ టైం బాలకృష్ణ కే ఎస్ రవికుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రూలర్ పై ఇలాంటిదే జరిగింది.

ముందు రిలీజ్ చేసిన వర్కింగ్ ఫోటోలు అద్బుతంగా ఉన్నాయని, బాలయ్య టోని స్టార్క్ లా ఉన్నాడని మెచ్చుకోగా తర్వాత పోలిస్ డ్రెస్ లో రిలీజ్ చేసి టైటిల్ అనౌన్స్ చేసిన పోస్టర్స్ ఓ రేంజ్ లో ట్రోల్ కి గురి అయ్యాయి. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ఈ లుక్స్ కన్నా బాగుంటాయి అంటూ…

ఇతర హీరోల ఫ్యాన్స్ కి తోడూ అభిమానులు కూడా యూనిట్ పై కోప గించుకున్నారు. ఇక రీసెంట్ గా సినిమా టీసర్ త్వరలో రాబోతుంది అంటూ సరికొత్త లుక్ ని రిలీజ్ చేయగా అది చూసి ఇప్పుడు బాలయ్య లుక్ అదిరి పోయిందని అభిమానులే కాదు… ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా మెచ్చుకుంటున్నారు.

పోస్టర్ లో బాలయ్య సైడ్ లుక్ చూస్తుంటే బరువు బాగానే తగ్గినట్లు అనిపిస్తుంది, అలాగే స్టైలిష్ అవుట్ ఫిట్ తో లుక్ అదిరిపోయింది అనే చెప్పాలి. దాంతో పోస్టర్ నేషనల్ వైడ్ గా టాప్ 8 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతుంది. ఇక సినిమా అఫీషియల్ టీసర్ ని త్వరలోనే రిలీజ్ చేస్తామని యూనిట్ అనౌన్స్ చేసింది.

సినిమా అన్ని హంగులను పూర్తీ చేసుకుని డిసెంబర్ 20 న భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, ఈ ఇయర్ ఇప్పటికే 2 సినిమాలతో వచ్చిన బాలయ్య భారీ గా నిరాశ పరిచాడు, ఇక జై సింహా తో తనకి హిట్ ఇచ్చిన కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో వస్తున్న రూలర్ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!