న్యూస్ రివ్యూ

మోసగాళ్ళు రివ్యూ-రేటింగ్….హిట్టా….ఫ్లాపా!!

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది మంచు విష్ణు కి, ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్ తో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవీద్ మరియు నవీన్ చంద్ర ల కాంబినేషన్ లో మంచు విష్ణు నటించి నిర్మించిన లేటెస్ట్ మూవీ మోసగాళ్ళు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయింది, మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది, 50 కోట్ల బడ్జెట్ కి న్యాయం చేసిందా లేదా తెలుసు కుందాం పదండీ..

ముందుగా కథ పాయింట్ కి వస్తే…చిన్నప్పటి నుండి మిడిల్ క్లాస్ లైఫ్ తో విసుగు చెందే విష్ణు కాజల్ లు పెద్దయ్యాక విష్ణు కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ అవుతాడు, కాజల్ అకౌంటెంట్ అవుతుంది, ఈ ఇద్దరు కలిసి బిగ్గెస్ట్ IT స్కాం ఎలా చేశారు, వీళ్ళ పట్టుకోవడానికి ACP సునీల్ శెట్టి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, మరి వీళ్ళు దొరికారా లేరా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా కథ పాయింట్ నిజంగా జరిగిన స్టొరీ నే అయినా సినిమా కాబట్టి కొన్ని మార్పులు చేర్పులతో సినిమాను తెరక్కేకించారు, సినిమా ఫస్టాఫ్ కథ టేకాఫ్ అవ్వడానికి టైం పట్టగా సిబ్లింగ్స్ గా కాజల్ మరియు విష్ణు ల పెర్ఫార్మెన్స్ బాగుంది, చాలా టైం తర్వాత మంచు విష్ణు మంచి రోల్ తో ఆకట్టుకోగా కాజల్ కూడా తన రోల్ వరకు ఫుల్ న్యాయం చేసింది.

ఇక నవదీప్, నవీన్ చంద్ర మరియు సునీల్ శెట్టి లు తమ తమ రోల్స్ లో పర్వాలేదు అనిపించారు, సంగీతం జస్ట్ ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది, చాలా సీన్స్ ని బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ కూడా చేసింది, ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే జస్ట్ ఒక అనిపించే విధంగా ఉండగా సినిమాటోగ్రఫీ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పిస్తాయి.

ఇలాంటి స్కాం కథ తో తెరకెక్కిన సినిమాలు చాలానే వచ్చాయి. ఈ సినిమా కూడా ఆ కోవలోకే వచ్చే సినిమా అయినా కొన్ని సీన్స్ మినహా మరీ అంత స్పెషల్ గా ఏమి అనిపించలేదు, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్స్ రెండూ మెప్పించాగా మిగిలిన సినిమాలో అంచనాలను అందుకున్న సీన్స్ ని అతి కష్టం మీద వెతికే కానీ దొరకవు, ఇక ఈ సినిమా కి 50 కోట్ల బడ్జెట్ అయ్యింది అన్నారు కానీ..

అంత బడ్జెట్ తెరపై క్వాలిటీ పరంగా అయితే అనిపించలేదు… బహుశా స్టార్ కాస్ట్ అండ్ హాలీవుడ్ డైరెక్టర్ లకే ఎక్కువ రెమ్యునరేషన్ వెళ్లి ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…ఈ స్టొరీ కి హాలీవుడ్ డైరెక్టర్ ను ఎందుకు ఎంచుకున్నారో మంచు విష్ణుకే తెలియాలి, ఇక్కడ డైరెక్టర్స్ లో ఎవరైనా ఇలాంటి స్టొరీ ని ఇలానే తెరకెక్కించేవాళ్ళు. సినిమా ఓవరాల్ గా చెప్పాలి అంటే…

కొన్ని పార్టు పార్టులుగా బాగున్నా ఓవరాల్ గా స్టొరీ పరంగా చూసుకుంటే ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ తప్పితే మిగిలిన సీన్స్ అన్నీ ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తప్పని విధంగా సాగుతూ ఉంటుంది, ఫస్టాఫ్ ఇంటర్వెల్ నుండి స్పీడ్ అందుకుని సెకెండ్ ఆఫ్ కొంచం క్యారీ అయినా తర్వాత స్లో అయ్యి తిరిగి క్లైమాక్స్ ఇంటరెస్టింగ్ ముగిసి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది.

మరీ యూనిట్ చెప్పినట్లు అద్బుతం కాకున్నా కొంచం ఓపిక తో చూస్తె ఒకసారి చూడొచ్చు లే అనిపిస్తుంది, మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్... ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది ఎలాంటి కలెక్షన్స్ ని దక్కించుకుంటుందో చూడాలి.

Leave a Comment