న్యూస్

మోసగాళ్ళు సినిమా కి ఈ రేంజ్ ట్రోల్ ఎవ్వరూ చేసి ఉండరు…సోషల్ మీడియా షేక్ అయింది!

మంచు విష్ణు కాజల్ అగర్వాల్ సునీల్ శెట్టి నవదీప్ మరియు నవీన్ చంద్ర లాంటి స్టార్ కాస్ట్ తో హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో రూపొందిన మోసగాళ్ళు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఓ రేంజ్ లో నిరాశ పరిచిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఊహకందని డిసాస్టర్ అనిపించుకోగా సినిమా బడ్జెట్ దృశ్యా చూసుకుంటే ఏకంగా….

50 కోట్ల బడ్జెట్ కి కేవలం 1 కోటి షేర్ ని మాత్రమే రాబట్టి భారీ డిసాస్టర్ గా నిలిచింది. అలాంటి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు భారీగానే ట్రోల్ కి గురి అవ్వగా రీసెంట్ గా సినిమా డిజిటల్ రిలీజ్ ను అమెజాన్ ప్రైమ్ లో కన్ఫాం చేసుకుంది…

సినిమా చూసిన వాళ్ళు అందరూ మరో రౌండ్ వేసుకున్నారు ఈ సినిమాను… ఇంత సిల్లీ థాట్ తో సినిమా ఎలా తీశారు అంటూ కొందరు… మీరు పెట్టిన బడ్జెట్ ఏంటో ఎక్కడా కనిపించడం లేదని కొందరు ట్రోల్ చేయగా ఓ ట్రోల్ కి మాత్రం టోటల్ సోషల్ మీడియా షేక్ అయింది అని చెప్పొచ్చు.

అన్ని చోట్ల మీమ్స్ లో వాడే రేంజ్ లో ట్రోల్ చేశారు ఒక యూసర్… సినిమా మొత్తాన్ని 3 కొట్లలో తీసి 50 కోట్లతో సినిమా తీశామని ప్రచారం చేశారని, అది చూసి ప్రైమ్ వాళ్ళు 5 కోట్ల ఆఫర్ చేసి సినిమా డిజిటల్ హక్కులు తీసుకున్నారని, అసలు సిసలు మోసగాడివి నువ్వన్నా అంతో మంచి విష్ణు ట్వీట్ కి కామెంట్ పెట్టారు. ఆ ట్వీట్ కి సోషల్ మీడియా లో…

రీచ్ మాములుగా దక్కలేదు… సినిమా చూసిన చాలామందికి కూడా ఇలాంటి డౌటే వచ్చింది అని చెప్పొచ్చు. కానీ రెమ్యునరేషన్స్ కే ఎక్కువ అమౌంట్ వెళ్ళింది అంటూ ట్రేడ్ లో టాక్ ఉంది కానీ అది ఎంతవరకు నిజం అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. మొత్తం మీద ఈ సినిమా రన్ ని కంప్లీట్ చేసుకున్నా ట్రోల్ ఇంకా అవుతూనే ఉందని చెప్పాలి.

Leave a Comment