న్యూస్ బాక్స్ ఆఫీస్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ – పెళ్లి సందD…10th డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని సాలిడ్ కలెక్షన్స్ తో ముగించిన తర్వాత రెండో వారంలో అడుగు పెట్టిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరియు పెళ్లి సందD సినిమాలు రెండో వీకెండ్ లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపుతున్నాయి. రెండు సినిమాలో రెండో ఆదివారం రోజున మంచి హోల్డ్ తో పరుగును కొనసాగిస్తున్న ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వలన ఎఫెక్ట్ అయితే పడింది…

దాంతో ఓవరాల్ గా 10 వ రోజు మరీ 9 వ రోజు లెవల్ లో 8 రోజు కన్నా సాలిడ్ గ్రోత్ అయితే బుకింగ్స్ లో కనిపించలేదు కానీ ఉన్నంతలో సినిమాలు 9 వ రోజు లెవల్ కి ఏమాత్రం తీసిపోని విధంగా హోల్డ్ అయితే చేశాయి అని చెప్పాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఈ రోజు…

బాక్స్ ఆఫీస్ దగ్గర 30-35 లక్షల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 40 లక్షల రేంజ్ కి వెళ్ళొచ్చు. ఇక పెళ్లి సందD సినిమా 25-30 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 35 లక్షల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది, మరి 2 సినిమాల 10 వ రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment