న్యూస్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీసర్ 24 గంటలు ఓవర్…షాకింగ్ రిపోర్ట్ ఇది!!

మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినా డాన్సులు ఫైట్స్ విషయంలో తన మార్క్ చూపెట్టినా కానీ అఖిల్ అక్కినేని బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన బ్లాక్ బస్టర్ ని కొట్టాల్సిన టార్గెట్ ఇంకా తీరలేదు, ఇలాంటి టైం లో మరోసారి ఆడియన్స్ ముందుకు సటిల్డ్ రోల్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో పూజ హెగ్డే హీరోయిన్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో…

సంక్రాంతి బరిలో నిలవనున్న అఖిల్ ఈ సినిమా తో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ రీసెంట్ ఫామ్ కూడా అద్బుతంగా ఉండటం తో ఈ సారి హిట్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక రీసెంట్ గా ఈ సినిమా…

అఫీషియల్ టీసర్ ను దసరా కానుకగా రిలీజ్ చేయగా పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ ని టీసర్ సొంతం చేసుకుంది. మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే సరికి ఈ సినిమా టీసర్ కి ఒక లక్షా 3 వేల దాకా లైక్స్ దక్కగా టాప్ 5 లో చోటు దక్కించు కోలేక పోయింది.

ఇక వ్యూస్ పరంగా 24 గంటలు పూర్తీ అయ్యే సరికి 3.15 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోగలిగింది ఈ సినిమా. మొత్తం మీద 24 గంటల్లో పర్వాలేదు అనిపించే విధంగా రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నా కానీ టైర్ 2 హీరోల విషయం లో రికార్డులు అందుకున్న టీసర్ల విషయం లో ఎంటర్ అవ్వలేక పోయింది ఈ టీసర్…. టాప్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ….

వరల్డ్ ఫేమస్ లవర్ టీసర్ 6.28 మిలియన్ వ్యూస్ తో 2 లక్షల 68 వేల దాకా లైక్స్ తో టాప్ లో ఉండగా తర్వాత ప్లేస్ లో వ్యూస్ పరంగా మజిలీ 5 మిలియన్స్ దాకా వ్యూస్ తో లైక్స్ పరంగా వి మూవీ 1 లక్షా 85 వేల లైక్స్ తో ఉన్నాయి… ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సంక్రాంతి రేసు లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Leave a Comment