న్యూస్ రివ్యూ

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

అఖిల్ అక్కినేని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు మూడు సినిమాలు చేయగా మూడు కూడా నిరాశనే మిగిలించాయి… ఇలాంటి టైం లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే… న్యూ యార్క్ సిటీలో ఫైనాన్షియల్ గా బాగా సెటిల్డ్ అయిన ఫ్యామిలీ నుండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన హీరో పెరగడం అక్కడ పెరిగినా కొంచం ఓల్డ్ ఆలోచనలను గలిగి ఉంటాడు, పెళ్లి ఏజ్ వచ్చిన హీరో 20 రోజుల పాటు ఇండియాకి…

డిఫెరెంట్ పెళ్లి చూపులు అటెండ్ అయ్యి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని వస్తాడు..మరో వైపు స్టాండ్ అప్ కామెడీ చేసే హీరోయిన్ ఫ్యూచర్ భర్త కోసం చాలా హోప్స్ పెట్టుకుంటుంది.. ఇండియా కి వచ్చిన తర్వాత హీరో ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి…. హీరోయిన్ తో ఎలా కలిసాడు తర్వాత ఏమైంది అన్నది అసలు సిసలు కథ…

పెర్ఫార్మెన్స్ పరంగా అఖిల్ తన ఇది వరకు సినిమాలతో పోల్చితే నటుడిగా ఇంకాస్త మెరుగు అయ్యాడు, తన యాక్టింగ్ బాగుంది, డైలాగ్ డిలివరీ ఆకట్టుకుంది, ఇక హీరోయిన్ పూజా రోల్ పర్వాలేదు అనిపించినా ఇద్దరి పెయిర్ బాగుంది, కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంది. ఇతర నటీనటులు కూడా ఉన్నంతలో బాగా నటించారు… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా మాములుగా ఉన్నాయి…

ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ మాత్రం…. చాలా నెమ్మదిగా సాగిన స్క్రీన్ ప్లే బోర్ కొట్టిస్తుంది…. పాటలు వినడానికి ఎంత బాగున్నాయో స్క్రీన్ పై కూడా విజువల్స్ ఆకట్టుకున్నాయి, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది, డైలాగ్స్ బాగా రాసుకున్నారు… సినిమాటోగ్రఫీ మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…

బొమ్మరిల్లు భాస్కర్ తను ఆల్ రెడీ తీసిన ఆరెంజ్ ని అలాగే రీసెంట్ గా వచ్చిన ఓ చిన్న సినిమా షాదీ ముబారక్ కథ పాయింట్ ని కలిపి ఈ సినిమా ను తీసినట్లు అనిపించింది, ఎంటర్ టైన్ మెంట్ ని బాగానే హ్యాండిల్ చేసిన భాస్కర్ ఎమోషనల్ పార్ట్ ని అంత బాగా హ్యాండిల్ చేయలేదు… ఫస్టాఫ్ వరకు ఎంటర్ టైన్ మెంట్ అండ్ పాత్రల పరిచయం…

ప్లెజంట్ మ్యూజిక్ తో ఓవరాల్ గా ఫస్టాఫ్ మెప్పించగా సెకెండ్ ఆఫ్ సినిమా చాలా రొటీన్ గా సాగుతుంది, చిన్న స్టొరీ లైన్ నే అవ్వడంతో సాగదీసినట్లు రిపీట్ సీన్స్ బోర్ కొట్టిస్తాయి సెకెండ్ ఆఫ్ లో, అయినా కానీ ఫస్టాఫ్ ఎంటర్ టైన్ చేయడం, 2 సూపర్ హిట్ సాంగ్స్ బాగుండటం, సినిమా గ్రాండియర్ ఆకట్టుకోవడం…

పెర్ఫార్మెన్స్ లు మెప్పించడం లాంటివి ప్లస్ పాయింట్స్ అవ్వగా సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అవ్వడం, ట్రాక్ తప్పడం, కథ అంత బలంగా లేకపోవడం, లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్…. అయినా కానీ యూత్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి సినిమాలో…. మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్….

Leave a Comment