న్యూస్ బాక్స్ ఆఫీస్

యాక్షన్ కలెక్షన్స్: టార్గెట్ 7.2 కోట్లు…ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్!!

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోల్లో విశాల్ కూడా ఒకరు 2018 ఇయర్ లో ఇక్కడ అభిమన్యుడు మరియు పందెం కోడి 2 సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న విశాల్ ఈ ఇయర్ అయోగ్య తో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు యాక్షన్ అంటూ రా ఏజెంట్ నేపధ్యంలో ఉన్న సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాగా… సినిమా ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని…

సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మాత్రం తెలుగు రాష్ట్రాలలో నిరాశ పరిచింది, సినిమా బిజినెస్ దృశ్యా సాధించిన కలెక్షన్స్ ఏమాత్రం బిజినెస్ కి మ్యాచ్ అవ్వని విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. నవంబర్ అన్ సీజన్ అంటారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఈ సినిమా పై పడి ఉండొచ్చు.

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు మినిమం 70 లక్షల నుండి 80 లక్షల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని భావించినా మొత్తం మీద మొదటి రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 66 లక్షల రేంజ్ లో నే షేర్ ని రాబట్టి షాకింగ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.

ఒకసారి ఏరియాల వారి షేర్స్ ని గమనిస్తే
?Nizam: 28L
?Ceeded: 10L
?UA: 7.5L
?East: 5.5L
?West: 3.2L
?Guntur: 4.7L
?Krishna: 4.9L
?Nellore: 2.2L
AP-TG Day 1:- 0.66Cr
సినిమా బిజినెస్ తక్కువ అయ్యి ఉంటె ఇవి డీసెంట్ ఓపెనింగ్స్ అని చెప్పి ఉండొచ్చు కానీ యాక్షన్ మూవీ తెలుగు రాష్ట్రాల బిజినెస్ మొత్తం మీద…

6.7 కోట్ల రేంజ్ లో ఉండటం తో బ్రేక్ ఈవెన్ కి సినిమా 7.2 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, కానీ మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్ తర్వాత బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 6.54 కోట్ల రేంజ్ కి ఏమాత్రం తగ్గని కలెక్షన్స్ ని అందుకుంటేనే హిట్ అవుతుంది, వీకెండ్ లో సినిమా భారీ గ్రోత్ ని అందుకుంటేనే ఇది సాధ్యం అని చెప్పొచ్చు.

Leave a Comment