న్యూస్ బాక్స్ ఆఫీస్

యాక్షన్ Vs తెనాలి రామకృష్ణ ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ 2 నోటేడ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి, అందులో ఒకటి సందీప్ కిషన్ నటించిన తెనాలి రామ కృష్ణ కాగా మరోటి కోలివుడ్ హీరో విశాల్ నటించిన యాక్షన్ తెలుగు డబ్ మూవీ, రెండు సినిమాలు వేటికవే డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ కాగా తెనాలి రామకృష్ణ పూర్తిగా కామెడీ బ్యాడ్రాప్ తో తెరకెక్కిన సినిమా కాగా యాక్షన్ మూవీ రా ఏజెంట్స్ నేపధ్యంలో తెరకెక్కిన సినిమా అవ్వడం విశేషం.

కానీ నవంబర్ అన్ సీజన్ గా చెబుతారు కాబట్టి ఆ ఎఫెక్ట్ 2 సినిమాల పై గట్టిగానే పడింది అని చెప్పాలి. రెండు సినిమాల్లో కొంచం బెటర్ మూవీ గా యాక్షన్ టాక్ ని సొంతం చేసుకున్నా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ పరంగా రెండు సినిమాలు యావరేజ్ గానే నిలిచాయి.

ముందుగా సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ గురించి మాట్లాడితే సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 20% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి 25% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అయింది. దాంతో సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద….

40 లక్షల నుండి 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆఫ్ లైన్ లెక్కలు పూర్తిగా తేలాల్సి ఉండగా ఈ లెక్క పెరగడమో తగ్గడమో జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక విశాల్ యాక్షన్ సినిమా కొంచం బెటర్ గా ఓపెన్ అయింది.

మార్నింగ్ అండ్ నూన్ షోలకు 25% వరకు ఆక్యుపెన్సీ తో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు 30% లోపు ఆక్యుపెన్సీ తో రన్ అవ్వడం తో ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకునే చాన్స్ ఉంది. మరి 2 సినిమాల అఫీషియల్ మొదటి రోజు కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Leave a Comment