టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

యావరేజ్ టాక్ అన్నారు…ఊచకోత కోసిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా టోటల్ కలెక్షన్స్!

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కి మరీ అద్బుతమైన టాక్ ఏమి లభించలేదు, సినిమా కి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు యావరేజ్ అంటూ టాక్ వచ్చినా కానీ సినిమా లో సాంగ్స్ సూపర్ పాపులర్ అవ్వడం సినిమా కి బాగా కలిసి వచ్చింది, అదే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడానికి బాగా హెల్ప్ చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ నుండి మొదటి వారం వరకు సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. తర్వాత వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం తో సినిమా పరుగును త్వరగానే ముగించాల్సి రాగా మొత్తం మీద సినిమా…

సాధించిన టోటల్ బిజినెస్ పై మంచి లాభాలను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ పరుగును ముగించింది అని చెప్పాలి. సినిమాను మొత్తం మీద 4.4 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 4.80 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా పరుగు పూర్తీ అయ్యే టైం కి సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 2.16Cr
👉Ceeded: 1.35Cr
👉UA: 87L
👉East: 53L
👉West: 42L
👉Guntur: 59L
👉Krishna: 50L
👉Nellore: 29L
AP-TG Total:- 6.71CR(11.60Cr Gross~)
Ka+ ROI – 25L(Updated)
OS – 28L
Total WW: 7.24Cr(12.70Cr~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్. మొత్తం మీద 4.8 కోట్ల టార్గెట్ కి సినిమా టోటల్ గా సాధించిన 7.24 కోట్ల షేర్ తో…

2.44 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా కి వచ్చిన యావరేజ్ టాక్ కి ఇది సెన్సేషనల్ కలెక్షన్స్ అని చెప్పాలి. సినిమాలో సాంగ్ అల్టిమేట్ హిట్ అవ్వడం సినిమాకి యూత్ లో మంచి రీచ్ దక్కేలా చేయగా అదే సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ ని దక్కేలా చేసింది..

Leave a Comment