న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

యావరేజ్ సినిమా అన్నారు…240 కోట్లు అవుట్ అక్కడా!!

టాలీవుడ్ లో సంక్రాంతి మూవీస్ ల సందడి పీక్స్ కి వెళ్ళడం తో ఇతర ఇండస్ట్రీ ల విషయాలను పెద్దగా పట్టించుకోలేదు ఎవ్వరు. ఈ సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ లో 2 సినిమాలు సాధించిన కలెక్షన్స్ తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేశాయి. ఓవరాల్ గా 2 సినిమాలు కూడా సక్సెస్ ఫుల్ మూవీస్ కాగా టాలీవుడ్ ప్రీవియస్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ మూవీ రంగస్థలం కలెక్షన్స్ ని బ్రేక్ చేశాయి.

ఇక బాలీవుడ్ లో ఇయర్ మొదట్లో రిలీజ్ అయిన బిగ్ మూవీ తానాజీ ది అన్ సంగ్ వారియర్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 3D లో రూపొందగా బాక్స్ ఆఫీస్ దగ్గర జనవరి 10 న రిలీజ్ అవ్వగా సినిమా కి ఓవరాల్ గా 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు…

అయినా సినిమా పరంగా రెగ్యులర్ స్టొరీ నే అంటూ యావరేజ్ టాక్ నే చెప్పారు. అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. అందరి అంచనాలను మించేసి హీరో అజయ్ దేవగన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది.

మూడు వారాలు పూర్తీ అయ్యే సరికి ఇండియా లోనే ఈ సినిమా 238 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా నాలుగో వారం మొదటి రోజు కలెక్షన్స్ తో 240 కోట్ల మార్క్ ని అధిగమించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సినిమా ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి 270 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చని అంటున్నారు.

సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 150 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ కాగా ఆ మార్క్ ని ఎప్పుడో దాటేసి భారీ లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 350 కోట్లకు పైగా గ్రాస్ ని ఇప్పటికే సొంతం చేసుకుందని అంచనా వేస్తున్నారు. దాంతో  యావరేజ్ టాక్ చెప్పినా ఊహకందని కలెక్షన్స్ తో ఈ సినిమా ఊచకోత కోసింది.

Leave a Comment