న్యూస్ రివ్యూ

యువరత్న టాక్ ఏంటి…..సినిమా హిట్టా-ఫట్టా!!

కన్నడ నుండి తెలుగు లో డబ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చిన మరో కొత్త సినిమా యువరత్న. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన ఈ సినిమా కన్నడ తో పాటు తెలుగు లో కూడా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఎంతవరకు ఆడియన్స్ అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే కాజేల్ గొడవల్లో పాల్గొన్నందుకు హీరోను రస్టికేట్ చేస్తారు. కట్ చేస్తే కొన్ని కారణాల వల్ల…

ఓ బ్రిలియంట్ స్టూడెంట్ అయిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది, ఆ కాలేజ్ ప్రకాష్ రాజ్ ది… అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న విద్యాశాఖ మంత్రి పై ప్రకాష్ రాజ్ పోరాడుతూ ఉండగా హీరో ప్రకాష్ రాజ్ కి హెల్ప్ చేస్తాడు. అసలు హీరోకి ప్రకాష్ రాజ్ కి లింక్ ఏంటి… అసలు ఆ కాలేజ్ లో ఏం జరుగుతుంది.

హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి… లాంటివి అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… స్టొరీ లైన్ ఏమైనా అర్ధం అయిందా కాలేదు కదా… సినిమాలో ఇలా అనేక ట్విస్ట్ లు ఉండటం కథ అసలు ఏ కోణంలో ముందుకు వెళుతుంది… లాంటి సందేహాలు ఉండటం స్క్రీన్ ప్లే వీక్ గా ఉండటం తో….

సినిమా మొదలు అయిన కొద్ది సేపటి తర్వాత ఎటు నుండి ఏటో పోతూ ఉంటుంది, కథ విషయాన్ని పక్కకు పెడితే హీరోగా పునీత్ రాజ్ కుమార్ హీరోయిజం, డాన్సులు, ఫైట్స్ కచ్చితంగా ఇంప్రెస్ చేశాయి అని చెప్పాలి.. హీరోయిన్ సయ్యేశా అలా వచ్చి ఇలా వెళుతూ ఉంటుంది.. ప్రకాష్ రాజ్, సాయి కుమార్ పర్వాలేదు. తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సాంగ్స్ బాగున్నాయి.

మొత్తం మీద కన్ఫ్యూజన్ ఎక్కువ అవ్వడం, సినిమా స్లో గా రన్ అవ్వడం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్, కానీ సోషల్ మెసేజ్ బాగుండటం, ముందు చెప్పినట్లు హీరో ఇంప్రెస్ చేయడం తో సినిమా మొత్తం మీద ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. మన దగ్గర ఇలాంటి మెసేజ్ మూవీస్ చాలా వచ్చాయి. ఇది కూడా ఒకసారి చూసే విధంగా ఉందని చెప్పొచ్చు…మరీ అద్బుతం కాదు కానీ పర్వాలేదు…

Leave a Comment