టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

యువరత్న తెలుగు టోటల్ కలెక్షన్స్….ఆ 2 దెబ్బ కొట్టినా కానీ బానే వచ్చాయి…కానీ!!

కన్నడ నుండి తెలుగు లో డబ్ అవుతున్న సినిమాలు ఈ మధ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే, ఇది వరకు కేవలం ఉపేంద్ర సినిమాలు మాత్రమే ఎక్కువగా ఇక్కడ డబ్ అవుతూ ఉండేవి కానీ ఇప్పుడు KGF సూపర్ సక్సెస్ తో రీసెంట్ టైం లో తెలుగు లో డబ్ అవుతున్న కన్నడ మూవీస్ సంఖ్య పెరుగుతూ వచ్చింది, కానీ ఎందుకనో ఏవి కూడా KGF లాగా ఆడియన్స్ ను అలరించ లేక పోయాయి అని చెప్పాలి.

ఈ ఇయర్ ఇప్పటికే పొగరు, రాబర్ట్ లాంటి సినిమాలు తెలుగు లో లక్ ని ట్రై చేసినా ఫలితం రాలేదు, ఇక ఇలాంటి టైం లో సమ్మర్ కానుకగా కన్నడ తో పాటు తెలుగు లో రిలీజ్ అయిన అక్కడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ….

యువరత్న ఒకేసారి కన్నడ మరియు తెలుగు లో రిలీజ్ అవ్వగా మంచి టాక్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో వైల్డ్ డాగ్ మరియు సుల్తాన్ సినిమాల పోటి వలన భారీ ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి, ఇక రెండో వారం లో వకీల్ సాబ్ కూడా ఉండటం తో…

పరుగును త్వరగానే ముగించాల్సి వచ్చింది ఈ సినిమా కి, మొత్తం మీద పరుగు కంప్లీట్ అయ్యే టైం కి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 48 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది, గ్రాస్ 86 లక్షల దాకా ఉందని సమాచారం. ఈ కలెక్షన్స్ లో డెఫిసిట్ లు మరియు నెగటివ్ షేర్స్ ని తీయకుండా చెబుతున్న కలెక్షన్స్ అని చెప్పొచ్చు.

మొత్తం మీద సినిమాను 60 లక్షలకు అమ్మగా సినిమా 80 లక్షల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది, మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైం కి 32 లక్షల లాస్ ను సొంతం చేసుకుంది, బిజినెస్ పరంగా చూసుకుంటే 12 లక్షల లాస్ వచ్చింది, అంత పోటి లో ఎలాంటి ప్రమోషన్ లు లేకుండా సినిమా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ నే సాధించింది, కొంచం ప్రమోషన్స్ ని బాగా చేసి ఉంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్ గా వచ్చి ఉండేది.

Leave a Comment