న్యూస్ బాక్స్ ఆఫీస్

యువరత్న 4 డేస్ తెలుగు కలెక్షన్స్…సగం ఔట్ అక్కడా….కానీ!!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ యువరత్న బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో మినిమమ్ ప్రమోషన్స్ చేయకున్నా కానీ సినిమా కి పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ మొత్తం మీద సినిమా బిజినెస్ ను అందుకునే రేంజ్ లో అయితే బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ రాలేదనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మొత్తం మీద 4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని ఇప్పుడు పూర్తీ చేసుకోగా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని మొత్తం మీద సొంతం చేసుకుంది. సినిమా మొదటి రోజు 14 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా, రెండో రోజు 11 లక్షల దాకా షేర్ ని దక్కించుకుంది.

ఇక మూడో రోజు సినిమా 7 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా, 4 వ రోజు ఆదివారం కావడం తో కొంచం గ్రోత్ సాధించిన ఈ సినిమా మొత్తం మీద 9 లక్షల దాకా షేర్ ని సాధించింది, ఈ కలెక్షన్స్ లో కొన్ని చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీయకుండా చెబుతున్న కలెక్షన్స్ లెక్కలు అని చెప్పాలి..

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల వీకెండ్ లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 41 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ ని 71 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమాను తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ కాకుండా మొత్తం మీద 60 లక్షల రేటు కి అమ్మారు. దాంతో సినిమా 80 లక్షలకి పైగా టార్గెట్ తో…

బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ లో సగం రికవరీ చేసింది, కానీ ఇంకా సగం కలెక్షన్స్ బాలెన్స్ ఉన్నాయి. వర్కింగ్ డేస్ లో సినిమా ఇలానే హోల్డ్ చేస్తే ఆ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంటుంది, అది మిస్ అయినా బిజినెస్ 60 లక్షలను టచ్ చేసే అవకాశం అయినా ఉంటుంది అని చెప్పాలి.

Leave a Comment