గాసిప్స్ న్యూస్

రంగస్థలం తమిళ్ రీమేక్…హీరో-డైరెక్టర్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం నంబర్ 1 మూవీ అలాగే టాలీవుడ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ రంగస్థలం సంచలనాలు అందరికీ తెలిసిందే. సినిమా వచ్చి ఏడాదిన్నర గడిచినా కానీ సాహో, సైరా లాంటి పెద్ద సినిమాల తెలుగు వర్షన్ కలెక్షన్స్ కూడా రంగస్థలం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని బీట్ చేయలేదు. అలాంటి సినిమా ను రిలీజ్ సమయం లోనే ఇతర భాషల్లో…

డబ్ చేసి ఉంటె ఓ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసి ఉండేది, కానీ నిర్మాతలు సినిమా రిలీజ్ అయిన చాలా సమయం తర్వాత కన్నడ లో మలయాళం లో డబ్ చేయగా రెండు చోట్లా ఫలితం తేడా కొట్టింది, వీటి కన్నా ముందు సినిమా ను తమిళ్ లో డబ్ చేసి రిలీజ్ చేయాలి అనుకున్నారు.

కానీ ఎందుకనో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న టీం ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హక్కులను అమ్మేసి ఇక డబ్బింగ్ కి పులిస్టాప్ పెట్టేసింది, ఇక సినిమా తమిళ్ లో రీమేక్ కి సిద్ధం అవుతుండగా రామ్ చరణ్ రోల్ లో ఎవరు నటిస్తారు అన్నది ఆసక్తిగా మారగా…

తమిళ్ లో తెలుగు లో కాంచన సిరీస్ తో పాపులర్ అయిన రాఘవ లారెన్స్ మెయిన్ లీడ్ చేస్తున్నాడట. ఇక డైరెక్టర్ గా పెద్దగా సక్సెస్ లు రీసెంట్ గా అందుకొని లింగుసామి ఈ సినిమా కి డైరెక్షన్ చేయబోతున్నట్లు సమాచారం. మెయిన్ లీడ్ లో ఎవరైనా స్టార్ హీరోలు చేస్తారు అనుకున్నా…

అనుకోకుండా లారెన్స్ సీన్ లోకి ఎంటర్ అవ్వడం తో అతనే కన్ఫాం అయ్యాడని తెలుస్తుంది, ఇది వరకు లారెన్స్ తెలుగు లో సూపర్ హిట్ అయిన పటాస్ ని అక్కడ రీమేక్ చేయగా ఆ సినిమా డిసాస్టర్ అయింది, ఇప్పుడు కాంచన 3 బ్లాక్ బస్టర్ తో ఊపు మీదున్నాడు కాబట్టి రంగస్థలం తమిళ్ రీమేక్ ఎలా ఉంటుంది అన్నది అందరి లోను ఆసక్తి రేపుతుంది.

Leave a Comment