న్యూస్ రివ్యూ

రణరంగం ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

శర్వానంద్ హీరోగా కాజల్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రణరంగం, స్టైలిష్ యంగ్ డైరెక్టర్ గా పేరున్న సుదీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన గ్యాంగ్ స్టార్ మూవీ రణరంగం నేడు మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ను లేట్ గా పూర్తి చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి ఎలాంటి టాక్ లభిస్తుందో తెలుసుకుందాం పదండీ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మొదలు అయ్యే సినిమా…..కథ పాయింట్ కి వస్తే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న టైం లో మద్యపాన నిషేధం సమయం లో ఇల్లీగల్ గా మందు ను స్మగ్లింగ్ చేసే హీరో అంచలంచలుగా ఎదుగుతాడు, కానీ తన లైఫ్ లో ఒక ప్రేమ ని కోల్పోయిన హీరో లైఫ్ లో ఒక శక్తిగా ఎదుగుతాడు,

ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఓవరాల్ గా సినిమా కథ పాయింట్ అని అంటున్నారు, కథ పాయింట్ చిన్నదే అయినా కొన్ని ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయని అంటున్నారు. శర్వానంద్ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకోగా ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టొరీ కళ్యాణి ప్రియదర్శన్ తో బాగుందని అంటున్నారు.

ఇక కాజల్ తో లవ్ స్టొరీ కూడా బాగానే ఉండగా సినిమా టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం టైం తీసుకుంటుందని, తర్వాత అక్కడక్కడా స్లో నరేషన్ తో కొంచం బోర్ ఫీల్ అవ్వాల్సి వస్తుందని అది తప్పితే సినిమా సింపుల్ గా ఒకసారి చూసేలా ఉందని అంటున్నారు. పాటలు పర్వాలేదు అనిపించేలా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుందని అంటున్నారు.

డైరెక్షన్ పరంగా సుదీర్ వర్మ తన ఇంపాక్ట్ ని కొంతవరకు మాత్రమే కలిగించాడని అంటున్నారు, ఓవరాల్ గా సినిమా యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో ఉందన్న టాక్ ఓవర్సీస్ నుండి వినిపిస్తుంది, ఇక ఇక్కడ రెగ్యులర్ షోలకు సినిమా కి ఎలాంటి టాక్ లభిస్తుందో చూడాలి.

1 Comment

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!