గాసిప్స్ న్యూస్

రవితేజ చేయాల్సిన సినిమా….ఇప్పుడు ఆ హీరో చేతిలో!!

మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హెవీ డిసాస్టర్ మూవీస్ తర్వాత చేసిన సినిమా క్రాక్, ఈ ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ అయిన ఈ సినిమా అనేక ఇబ్బందులను ఎదురుకుని కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ మూవీ గా కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచి సత్తా చాటుకుంది. దాంతో రవితేజ కెరీర్ మళ్ళీ మునుపటిలా…

ఓ రేంజ్ లో ఊపు అందుకోగా ఈ ఊపులో రవితేజ వరుస పెట్టి సినిమాలను కమిట్ అవుతూ వస్తుండగా ముందుగా ఖిలాడీ తర్వాత కొత్త డైరెక్టర్ తో ఒక సినిమా, తర్వాత త్రినాధ రావ్ నక్కిన డైరెక్షన్ లో ఒక సినిమా తర్వాత వక్కంతం వంశీ డైరెక్షన్ లో…

మరో సినిమా కమిట్ అయ్యాడు రవితేజ, ఖిలాడీ పూర్తీ చేసిన తర్వాత త్రినాధ రావ్ సినిమా అనుకుంటే కొన్ని కారణాల వలన ఆ సినిమా ఇప్పుడు ఆగిందని టాక్ గట్టిగా వినిపించగా ఆ సినిమా ప్లేస్ లో వక్కంతం వంశీ డైరెక్షన్ లో కథ ని రవితేజ ఓకే చేశాడు.

ఆ సినిమా ఖిలాడీ తర్వాత మొదలు అవుతుందని చెప్పగా ఇప్పుడు సడెన్ గా ఏమైందో తెలియదు కానీ ఆ సినిమా కూడా ఆగిపోయిందని టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా టాక్ వినిపిస్తుంది, కథ విషయం లో పూర్తీ సంతృప్తిగా లేని రవితేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని సమాచారం. అదే టైం లో వక్కంతం వంశీ అదే కథని ఇప్పుడు బాక్ టు బాక్…

ఫ్లాఫ్స్ అందుకున్న నితిన్ కి వినిపించగా నితిన్ ఓకే చెప్పాడని, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తోనే కంబ్యాక్ కి సిద్ధం అవుతున్నాడని అంటున్నారు. దాంతో ఇప్పుడు రవితేజ అప్ కమింగ్ మూవీస్ పై మళ్ళీ సందేహాలు మొదలు అవ్వగా ఖిలాడీ తర్వాత ఏ సినిమా సెట్స్ పైకి తీసుకు పోతాడు అన్నది ఆసక్తిగా మారింది.

Leave a Comment